రచయిత.. దర్శకుడు.. నటుడు.. సింగర్..

పోసాని కృష్ణమురళిలో సీజన్ కో యాంగిల్ కనిపిస్తోంది. రచయితగా పరిశ్రమకు పరిచయం అయిన పోసాని తర్వాత దర్శకుడిగా మారారు. ఆ తర్వాత నటుడిగా బిజీ అయ్యారు. ఓ దశలో కమెడియన్లకు ఏమాత్ర తీసిపోని కామెడీ చేశారు. ఇప్పుడు తనలోని మరో యాంగిల్ ను బయటపెట్టారు పోసాని. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 365 డేస్ సినిమాలో ఏకంగా పాట పాడారు పోసాని. వద్దురా మ్యారేజ్ రాజా అంటూ తనదైన శైలిలో గొంతు సవరించారు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ నిన్న (ఏప్రిల్ 23) తాజ్ డెక్కన్ లో గ్రాండ్ గా జరిగింది. చిన్న సినిమానే అయినప్పటికీ పోసాని పాడిన పాట పెద్ద ఎట్రాక్షన్ గా నిలిచింది. ఆడియో ఫంక్షన్ లో కూడా పోసానిని ఆ పాట పాడమని అంతా బలవంతం పెట్టారు. కానీ పోసాని మాత్రం సున్నితంగా తిరస్కరించారు. మరి పోసాని పాట ఆ పాట ఏ రేంజ్ లో హిట్టయిందో తెలియాలంటే.. 365 డేస్ విడుదల వరకు ఆగాల్సిందే.