Telugu Global
Others

సూర్యాపేట మార్కెట్ యార్డుపై రైతుల దాడి

సూర్యాపేట మార్కెట్‌యార్డు కార్యాల‌యంపై రైతులు దాడి చేశారు. అక్క‌డున్న‌ఫ‌ర్నిచ‌ర్‌ను ధ్వంసం చేశారు. కార్యాల‌య అద్దాల‌ను ప‌గుల‌గొట్టారు. తమ పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు ఇవ్వ‌డం లేద‌ని, వ్యాపారులు త‌మ‌ను మోసం చేస్తున్నార‌ని ఆరోపిస్తూ ఈ విధ్వంసానికి పూనుకున్నారు. వారికి స‌రైన స‌మాధానం చెప్ప‌డంలో అక్క‌డున్న ప్ర‌తినిధులు విఫ‌ల‌మ‌వ‌డంతో వారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధ‌ర్నాకు దిగారు. త‌మ పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌రలు చెల్లించాల‌ని వారు డిమాండు చేశారు. వ‌రికి అస‌లు మ‌ద్ద‌తు ధ‌ర‌లే ల‌భించ‌డం లేద‌ని నినాదాలు […]

సూర్యాపేట మార్కెట్‌యార్డు కార్యాల‌యంపై రైతులు దాడి చేశారు. అక్క‌డున్న‌ఫ‌ర్నిచ‌ర్‌ను ధ్వంసం చేశారు. కార్యాల‌య అద్దాల‌ను ప‌గుల‌గొట్టారు. తమ పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు ఇవ్వ‌డం లేద‌ని, వ్యాపారులు త‌మ‌ను మోసం చేస్తున్నార‌ని ఆరోపిస్తూ ఈ విధ్వంసానికి పూనుకున్నారు. వారికి స‌రైన స‌మాధానం చెప్ప‌డంలో అక్క‌డున్న ప్ర‌తినిధులు విఫ‌ల‌మ‌వ‌డంతో వారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధ‌ర్నాకు దిగారు. త‌మ పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌రలు చెల్లించాల‌ని వారు డిమాండు చేశారు. వ‌రికి అస‌లు మ‌ద్ద‌తు ధ‌ర‌లే ల‌భించ‌డం లేద‌ని నినాదాలు చేస్తూ హైద‌రాబాద్ – విజ‌యవాడ హై వే మీద‌కు వ‌చ్చారు. అక్క‌డ కూడా ధ‌ర్నాకు దిగ‌డంతో ట్రాఫిక్ స్తంభించి పోయింది.
First Published:  23 April 2015 11:06 PM GMT
Next Story