Telugu Global
NEWS

కుటుంబ‌రావుగారి లెక్క‌లు...

13 జిల్లాల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌ణాళిక‌లు రూపొందించ‌డానికి చార్టెర్డ్ అక్కౌంటెంట్‌గా ప్ర‌సిద్ధుడైన కుటుంబ‌రావును ఉపాధ్య‌క్షుడిగా నియ‌మించుకున్నారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు. రుణ‌మాఫీ వ్య‌వ‌హారం మొద‌లు రాజ‌ధాని భూముల వ‌ర‌కు అన్ని వ్య‌వ‌హారాల్లోనూ ఆయ‌న ప్ర‌భుత్వానికి స‌ల‌హాలు ఇస్తున్నారు. అప్పుడ‌ప్ప‌డు ప్రెస్‌మీట్స్ కూడా పెట్టి మీడియావారికి క్లాసులు చెబుతున్నారు. ఇంత‌కీ విష‌యం ఏమంటే అన్నా హ‌జారే, మేధాపాట్క‌ర్ వంటి సామాజిక కార్య‌క‌ర్త‌లు అనేక పంట‌లు పండే విలువైన భూముల్ని రాజ‌ధాని కోసం స‌మీక‌రించ‌డాన్ని వ్య‌తిరేకిస్తున్నారు. అన్నాహజారే సీఎం చంద్ర‌బాబుకు లేఖ కూడా […]

కుటుంబ‌రావుగారి లెక్క‌లు...
X
13 జిల్లాల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌ణాళిక‌లు రూపొందించ‌డానికి చార్టెర్డ్ అక్కౌంటెంట్‌గా ప్ర‌సిద్ధుడైన కుటుంబ‌రావును ఉపాధ్య‌క్షుడిగా నియ‌మించుకున్నారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు. రుణ‌మాఫీ వ్య‌వ‌హారం మొద‌లు రాజ‌ధాని భూముల వ‌ర‌కు అన్ని వ్య‌వ‌హారాల్లోనూ ఆయ‌న ప్ర‌భుత్వానికి స‌ల‌హాలు ఇస్తున్నారు. అప్పుడ‌ప్ప‌డు ప్రెస్‌మీట్స్ కూడా పెట్టి మీడియావారికి క్లాసులు చెబుతున్నారు. ఇంత‌కీ విష‌యం ఏమంటే అన్నా హ‌జారే, మేధాపాట్క‌ర్ వంటి సామాజిక కార్య‌క‌ర్త‌లు అనేక పంట‌లు పండే విలువైన భూముల్ని రాజ‌ధాని కోసం స‌మీక‌రించ‌డాన్ని వ్య‌తిరేకిస్తున్నారు. అన్నాహజారే సీఎం చంద్ర‌బాబుకు లేఖ కూడా రాసారు. అంతా అయిపోయాక ఇప్ప‌డు వాళ్ళొచ్చినా చేయ‌గ‌లిగిందేమీ లేద‌ని వ్య‌వ‌సాయ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. అదే స‌మావేశంలో పాల్గొన్న కుటుంబ‌రావు గారు రాజ‌ధానికి తీసుకుంటున్న భూముల్లో అనేక ర‌కాల పంట‌లు పండుతాయంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని, మీడియా మిత్రులు స్ట‌డీ చేసి రాయాల‌ని హిత‌వు చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ధాన్యాగార‌మంటే కేవ‌లం గోదావ‌రి జిల్లాలేన‌ని ఆయ‌న చెప్పారు. తుళ్ళూరు మండ‌లంలో పండే వ‌రి చాలా త‌క్కువ‌ని శెల‌విచ్చారు. అక్క‌డి రైతుల‌కు కూడా పెద్ద‌గా ఆదాయం ఉండ‌టంలేద‌ని అందుకే 70 శాతం భూముల్ని కౌలుకు ఇచ్చేశార‌ని కూడా ముక్తాయించారు. కేవ‌లం 30 శాతం రైతులే స్వంతంగా వ్య‌వ‌సాయం చేసుకుంటున్నార‌ని వివ‌రించారు. మొత్తానికి తుళ్ళూరు భూములకు పెద్ద‌గా విలువ లేద‌ని కుటుంబ‌రావు తేల్చేశారు.
First Published:  23 April 2015 11:04 PM GMT
Next Story