Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 63

ఒక వ్యక్తి దారంటీ వెళుతూ పక్కనే పొలం పని చేసుకుంటున్న రైతును “ఇక్కడినించి వికారాబాద్ ఎంత దూరముంటుంది?” అని అడిగాడు. రైతు తలెత్తి చూసి మళ్ళీ తల దించుకుని పనిలో మునిగిపోయాడు. ఆ వ్యక్తి చిత్రంగా రైతును చూసి తన దారంటీ తాను బయల్దేరాడు. వంద అడుగులు నడిచాడో లేదో రైతు “బాబూ! యిలారా!” అన్నాడు. ఆ వ్యక్తి వచ్చాడు. రైతు “వికారాబాద్ అరగంటలో చేరుకుంటావు” అన్నాడు. ఆ వ్యక్తి “ఆ సంగతి అప్పుడే చెప్పొచ్చు కదా!’ […]

ఒక వ్యక్తి దారంటీ వెళుతూ పక్కనే పొలం పని చేసుకుంటున్న రైతును "ఇక్కడినించి వికారాబాద్ ఎంత దూరముంటుంది?'' అని అడిగాడు. రైతు తలెత్తి చూసి మళ్ళీ తల దించుకుని పనిలో మునిగిపోయాడు.  ఆ వ్యక్తి చిత్రంగా రైతును చూసి తన దారంటీ తాను బయల్దేరాడు. వంద అడుగులు నడిచాడో లేదో రైతు "బాబూ! యిలారా!'' అన్నాడు. ఆ వ్యక్తి వచ్చాడు.  రైతు "వికారాబాద్ అరగంటలో చేరుకుంటావు'' అన్నాడు.  ఆ వ్యక్తి "ఆ సంగతి అప్పుడే చెప్పొచ్చు కదా!' అన్నాడు.  రైతు "నువ్వు ఎంత వేగంగా నడుస్తావో తెలీకుండా ఎలా చెప్పేది?' అన్నాడు.
"మీ ఇంట్లో పుస్తకాలు చాలా వున్నాయి. అన్నీ ఒక షెల్ఫ్లో పెట్టొచ్చు కదా!''
"పెట్టొచ్చు కానీ షెల్పు ఎవరూ అరువివ్వరు కదా!''
"ఆమె కళ్ళు మూసుకుని ఎందుకు పాటలు పాడుతుంది?''
"ఆమె మనసు మెత్తనిది. శ్రోతల ముఖాల్లో బాధని చూడలేదు''
"షాజహాన్ ముంతాజ్ బేగం కోసం తాజ్మహల్ కట్టాడు. మీరు నాకోసం ఏం కట్టారు?''  "నువ్వు కొన్న చీరలకి, నగలకి ఇన్స్టాల్ మెంట్లు కడుతున్నాను కదా!''  
First Published:  23 April 2015 9:03 PM GMT
Next Story