నాగ్ చెప్పిందే నిజమైంది

సరిగ్గా దోచేయ్ సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు నాగార్జున ఓ ట్వీట్ చేశారు. దోచేయ్ సినిమాను ఆద్యంతం చూశానని సినిమా సూపర్ హిట్ అవుతుందని నమ్మకంగా చెప్పుకొచ్చాడు. మరీ ముఖ్యమంగా ఆఖరి ఇంటర్వెల్ ఎపిసోడ్ తో పాటు.. 30నిమిషాల పాటు సాగే క్లయిమాక్స్ అద్భుతంగా ఉందని రాసుకొచ్చాడు. సినిమా ప్రమోషన్ కోసం నాగ్ అలా చెప్పాడని అంతా అనుకున్నారు. కానీ దోచేయ్ సినిమాకి నిజంగా నాగార్జున చెప్పినవే ప్లస్ పాయింట్స్ గా మారాయి. ఇంటర్వెల్ సీన్లు సినిమాకు ఆయువుపట్టు అనే టాక్ ఇప్పటికే వచ్చేసింది. పైగా సినిమా ఎత్తుగడ, నడిపించిన విధానం మూస సినిమాలకు భిన్నంగా కొత్తగా ఉందనే టాక్ వచ్చింది. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన దోచేయ్ సినిమాకు సంబంధించి ప్రిలిమినరీ టాక్ ఇది. ఓవరాల్ గా సినిమా ఎలా ఉందనే విషయం మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.