రీతు హత్య వెనుక మరో కొత్త కోణం ?

మాజీ ఎయిర్ హోస్టెస్ మృతి వెనుక మిస్ట‌రీ వీడింద‌ని పోలీసులు చెబుతున్నారు. అయితే రీతూ మృతి వెనుక అనుమానాలు ఇంకా తొలిగిపోలేదు. రిమోట్ విష‌యంలో గొడ‌వ జ‌రిగింద‌ని..స్నేహితుని ముందు అవ‌మానించ‌డంతోనే చంపేశాన‌ని భ‌ర్త స‌చిన్ పోలీసుల ఎదుట అంగీక‌రించాడు. ఆమె తలలో బలమైన గాయాలున్నట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ స్పష్టంచేయడంతో పోలీసులు సచిన్‌ని తమదైన స్టైల్లో విచారించారు. దీంతో సచిన్ తానే ఆమెని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఇంట్లో టీవీ రిమోట్ కోసం తన స్నేహితుడు రాకేష్ ఎదుటే రీతూ తనపై చేయి చేసుకుందని, ఈ అవమానం భరించలేకే దిండుతో తాను ఆమెకి ఊపిరాడకుండా చేసి చంపేశానని చెప్పాడు. ఆ సమయంలో తన స్నేహితుడు రాకేశ్ కూడా అక్కడే వున్నాడని సచిన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. రీతూ చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాతే ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్తున్నట్లు డ్రామా ఆడి, మార్గంమధ్యలోనే చనిపోయినట్లుగా కథ వినిపించినట్లు సచిన్ తెలిపాడు. దీంతో కళ్ల ముందు జరుగుతున్న హత్యని అడ్డుకోకపోవడంతోపాటు అసలు విషయాన్ని దాచిపెట్టినందుకు సచిన్ స్నేహితుడు రాకేష్ ని కూడా ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు రీతూ హ‌త్య వెనుక కొత్త‌కోణాలు విన్పిస్తున్నాయి. స‌చిన్  స్వలింగ సంపర్కుడనే అనుమానాలను కొంద‌రు విన్పిస్తున్నారు. ఆ స‌మ‌యంలో అత‌ని పాటు ఫ్రెండ్ ఎందుకు ఉన్నాడ‌ని…ఇంట్లోకి ఫ్రెండ్ తీసుకురావడంతోనే గొడ‌వ‌జ‌రిగింద‌ని తెలుస్తుంది. పుట్టిన కొడుకుపై కూడా స‌చిన్ అనుమానాలు వ్య‌క్తం చేయ‌డం దీనికి బ‌లం చేకూరుస్తుంది.