న‌టి ఖుష్బు కు అంత ఆస‌క్తి ఎందుకో…!

కాంగ్రేస్ మాజీ మంత్రి శశిథ‌రూర్ భార్య సునందా పుష్క‌ర్ హ‌త్యోందం పై త‌మిళ ద‌ర్శ‌కుడు ఒక చిత్రం చేస్తున్నారు. గ‌తంలో రాజీవ్ గాంధీ హ‌త్య‌.. ఆ త‌రువాత గంథ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ హ‌త్యోదంతం ఆధారంగా సినిమాలు చేసిన ద‌ర్శ‌కుడు ఏఎం ఆర్మ్రేష్. ఇప్పుడు ఈ డైరెక్టర్ సునందా పుష్క‌ర్ మిస్ట‌రి హ‌త్య ను ఆధారంగా చేసుకుని చిత్రం చేస్తున్నాడ‌ట‌. అయితే ఈ సినిమాకు సంబంధించి సీనియ‌ర్ న‌టీ ఖుష్బు ఆరాలు తీయ‌డం కోలీవుడ్ లో పెద్ద న్యూస్ అయ్యింది. డైరెక్ట‌గా డైరెక్ట‌ర్ ను అడిగి తెలుసుకోకుండా.. స‌హాయ ద‌ర్శ‌కుడిని విచారించి..ఇది సునందా పుష్క‌ర్ హ‌త్య కేసుకు సంబంధించిందా కాదా అని క్లారీఫై చేసుకున్నార‌ట‌. అయితే ఈ విష‌యం పై డైరెక్ట‌ర్‌ ఏఎం ఆర్మ్రేష్ ఆమెపై ధ్వజమెత్తారు. ఖుష్పు గారు తెలుసుకోవాలంటే త‌న‌ను డైరెక్ట్ గా అడ‌గొచ్చు కదా అని.. ఎందుకు ఇలా చేయ‌డం అంటూ మండి ప‌డ్డార‌ట‌.అయితే ఈ విష‌యం తెలిసిన ఖుష్బు త‌ను ఎవ‌ర్ని విచారించ‌లేద‌ని చెప్పిన‌ట్లు టాక్. 

ఇందులో అర్జున్, శ్యామ్, మనీషా కొయిరాలా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి శశిధర్ భార్య సునందా పుష్కర్ ఆత్మహత్య సంఘటన ఇతివృత్తంతో రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. డైరెక్ట‌ర్ మాట్లాడుతూ తన చిత్రం ఒక మర్మ హత్య సంఘటన ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రమేనని స్పష్టం చేశారు. మనీషా కొయిరాల హత్యకు గురవుతారన్నారు. ఆ హత్య గురించి ఇన్‌వెస్టిగేషన్‌నే చిత్ర ఇతివృత్తం అని చెప్పారు. ఇంతకంటే ప్రస్తుతానికి ఏమీ చెప్పలేనని దర్శకుడు చెప్పిన‌ట్లు స‌మాచారం.మ‌రి ఖుష్బు కు సునంద ఫుష్క‌ర్ హత్య గురించి సినిమా చేస్తుంటే అంత ఆస‌క్తి ఎందుకు?