అందరి కళ్లూ సత్యమూర్తి పైనే

సన్నాఫ్ సత్యమూర్తి సినిమా రేసుగుర్రాన్ని దాటుతుందా.. ఇదే ఇప్పుడు అందర్లో చర్చనీయాంశంగా మారింది. రిలీజైన మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ నడుస్తున్న ఈ సినిమా రేసుగుర్రాన్ని క్రాస్ అయితే నిజంగా అల్లు అర్జున్ కు స్టార్ డమ్ ఉన్నట్టే. అలాంటి పరిస్థితులేం కనిపించడం లేదని మొన్నటివరకు టాక్ ఉండేది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో సన్నాఫ్ సత్యమూర్తి మరింత స్ట్రాండ్ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా 40కోట్ల క్లబ్ లోకి చేరడంతో సినిమా వసూళ్ల పై అంచనాలు మరింత పెరిగాయి. రేసుగుర్రాన్ని క్రాస్ చేయాలంటే సన్నాఫ్ సత్యమూర్తి సినిమా మరో 12 కోట్లు వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దీనిపైనే దృష్టిపెట్టింది సన్నాఫ్ సత్యమూర్తి టీం. విడుదలై ఇన్ని రోజులైనప్పటికీ సినిమా పబ్లిసిటీని మాత్రం ఆపలేదు. తాజాగా త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలిసి విశాఖ లో సక్సెస్ మీట్ పెట్టారు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా సూపర్ హిట్ అయిందంటూ ప్రచారం చేశారు. త్వరలోనే మరిన్ని లొకేషన్లలో త్రివిక్రమ్-బన్నీ కలిసి పర్యటించాలని అనుకుంటున్నారు. వీళ్ల ప్రయత్నాలు ఫలించి సినిమా 50కోట్ల క్లబ్ లోకి చేరుతుందేమో చూడాలి.