Telugu Global
Others

తెలంగాణ వాహ‌నాల‌కు ఏపీలో ఎంట్రీ ట్యాక్స్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఏపీలో ప్ర‌వేశించే తెలంగాణ ర‌వాణా వాహ‌నాల‌పై ఎంట్రీ ట్యాక్స్ వ‌సూలు చేస్తోంది. శుక్ర‌వారం అర్థ‌రాత్రి నుంచే అమ‌ల‌య్యేలా ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ నుంచి ఏపీలోకి ప్ర‌వేశించే అన్ని మార్గాల్లోనూ ర‌వాణా అధికారులు చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి ప‌న్నులు వ‌సూలు చేస్తున్నారు. ఏపీ వాహ‌నాలకు ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచే తెలంగాణ ప్ర‌భుత్వం ఎంట్రీ ట్యాక్స్ వ‌సూలు చేస్తోంది.దీనిపై నిర‌స‌న‌లు పెల్లుబికినా, తెలంగాణ లారీ ఆప‌రేట‌ర్లు ఆందోళ‌న‌లు చేప‌ట్టినా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు. […]

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఏపీలో ప్ర‌వేశించే తెలంగాణ ర‌వాణా వాహ‌నాల‌పై ఎంట్రీ ట్యాక్స్ వ‌సూలు చేస్తోంది. శుక్ర‌వారం అర్థ‌రాత్రి నుంచే అమ‌ల‌య్యేలా ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ నుంచి ఏపీలోకి ప్ర‌వేశించే అన్ని మార్గాల్లోనూ ర‌వాణా అధికారులు చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి ప‌న్నులు వ‌సూలు చేస్తున్నారు. ఏపీ వాహ‌నాలకు ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచే తెలంగాణ ప్ర‌భుత్వం ఎంట్రీ ట్యాక్స్ వ‌సూలు చేస్తోంది.దీనిపై నిర‌స‌న‌లు పెల్లుబికినా, తెలంగాణ లారీ ఆప‌రేట‌ర్లు ఆందోళ‌న‌లు చేప‌ట్టినా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు. ఏపీ ఆప‌రేట‌ర్లు కోర్టుకు వెళ్ళినా ఫ‌లితం క‌నిపించ‌లేదు. ఏపీ ప్ర‌భుత్వం కేంద్ర ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ఉప‌యోగం క‌ల‌గ‌లేదు. తెలంగాణ ప్ర‌భుత్వాన్ని దారికి తెచ్చేందుకు మ‌రో మార్గ‌మేదీ క‌నిపించ‌క‌పోవ‌డంతో ఏపీ కూడా ఎంట్రీ ట్యాక్స్ విధించింది. ఈ ట్యాక్స్ వ‌ల్ల ఏపీ కంటే తెలంగాణ‌కే ఎక్కువ ఆదాయం వ‌స్తుంది.
First Published:  24 April 2015 9:27 PM GMT
Next Story