Telugu Global
National

లాతూరు క‌న్నా తీవ్రం ఈ భూకంపం

1993 సెప్టెంబ‌ర్ 30… ఇది భార‌త‌దేశానికి ముఖ్యంగా మ‌హారాష్ట్రకు దుర్దినం. అరోజు వ‌చ్చిన కిల్ల‌ర్ భూకంపం… 10 వేల మందిని పొట్ట‌న పెట్టుకుంది. 30 వేల మందిని క్ష‌త‌గాత్రుల్ని చేసింది. ఉస్మానాబాద్‌, లాతూరు… ఈ రెండు జిల్లాల్లో కేంద్రీకృత‌మైన భూకంపం చేసిన న‌ష్టం అపారం.  తెల్ల‌వారుజామున 3.45 నిమ‌షాల‌కు ఈ భూకంపం రావ‌డంతో ఆ స‌మ‌యానికి త‌లుపుల‌న్నీ వేసి ఉన్నాయి. అందరూ నిద్రలో ఉన్నారు. నిద్ర‌లో ఉన్న‌వారు నిద్ర‌లోనే చ‌నిపోయారు. భోపాల్ గ్యాస్ దుర్ఘ‌ట‌న ఎంత భయోత్పాతాన్ని […]

1993 సెప్టెంబ‌ర్ 30… ఇది భార‌త‌దేశానికి ముఖ్యంగా మ‌హారాష్ట్రకు దుర్దినం. అరోజు వ‌చ్చిన కిల్ల‌ర్ భూకంపం… 10 వేల మందిని పొట్ట‌న పెట్టుకుంది. 30 వేల మందిని క్ష‌త‌గాత్రుల్ని చేసింది. ఉస్మానాబాద్‌, లాతూరు… ఈ రెండు జిల్లాల్లో కేంద్రీకృత‌మైన భూకంపం చేసిన న‌ష్టం అపారం. తెల్ల‌వారుజామున 3.45 నిమ‌షాల‌కు ఈ భూకంపం రావ‌డంతో ఆ స‌మ‌యానికి త‌లుపుల‌న్నీ వేసి ఉన్నాయి. అందరూ నిద్రలో ఉన్నారు. నిద్ర‌లో ఉన్న‌వారు నిద్ర‌లోనే చ‌నిపోయారు. భోపాల్ గ్యాస్ దుర్ఘ‌ట‌న ఎంత భయోత్పాతాన్ని సృష్టించిందో అంతే ఉత్పాతాన్ని ఈ భూకంపం చ‌వి చూపించింది. 52 గ్రామాలు జాడ‌ లేకుండా పోయాయి. 27 వేల గృహాలు రూపురేఖ‌లు లేకుండా పోయాయి. మ‌రో రెండు ల‌క్ష‌ల ఇళ్ళు మ‌ర‌మ్మ‌తులు చేస్తే త‌ప్ప మ‌నుగ‌డ సాధ్యం కాని విధంగా త‌యార‌య్యాయి. రోడ్లు లేవు… వంతెన‌ల జాడ లేదు… క‌ల్వ‌ర్టులు క‌నిపించ‌కుండా పోయాయి. మైన‌ర్ డ్యాములు శిథిల‌మైపోయాయి. ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, స్కూలు భ‌వ‌నాలు, చారిత్ర‌క క‌ట్ట‌డాలు ఏవీ ఆన‌వాళ్ళు లేకుండా పోయాయి. అప్పుడు రెక్ట‌ర్ స్కేలుపై భూకంప తీవ్ర‌త 6.45గా న‌మోదు కాగా ఇపుడు 7.5గా న‌మోదైంది. అంటే అప్ప‌టి క‌న్నా ఇది తీవ్ర‌త ఎక్కువ‌న్న మాట‌! నేపాల్‌లోని భ‌ర‌త్‌పూర్‌కి 60 కిలోమీట‌ర్ల దూరంలో వ‌చ్చిన ఈ భూకంపం ఎంత న‌ష్టం చేసిందో సాయంత్రానికి గాని వెల్ల‌డ‌య్యే అవ‌కాశం లేదు. ఎందుకంటే అక్క‌డ సెల్ ట‌వ‌ర్ల‌న్నీ కూలిపోయాయి. మిగ‌తా ప్ర‌పంచంతో స‌మాచార సంబంధం తెగిపోయింది. లెట్స్ వెయిట్ అండ్ సీ! -పీఆర్‌
First Published:  25 April 2015 2:39 AM GMT
Next Story