Telugu Global
Others

తెలంగాణ‌లో ఆంధ్రుల గుర్తులు ఉండ‌టానికి వీల్లేదా?

ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత కూడా తెలంగాణ‌లో ఆంధ్రుల విగ్ర‌హాలు ఉండాలా, తెలుగు విశ్వ‌విద్యాల‌యానికి పొట్టి శ్రీరాములు పేర‌నే కొన‌సాగించాలా, తెలంగాణ భాష‌, యాస‌, సంస్కృతిని కించ‌ప‌రిచిన ఆంధ్రుల గుర్తులు ఈ రాష్ట్రంలో ఇంకెంత‌మాత్రం ఉండ‌టానికి వీల్లేద‌ని తెలంగాణ రాష్ట్ర స‌మితి ప్లీన‌రిలో్ తీర్మానం ఆమోదించారు. తెలంగాణ సాంస్కృతిక పున‌రుజ్జీవ‌నం పేరుతో ఆమోదించిన నాలుగో తీర్మ‌నాంలో న‌గ‌రంలో ఉన్న ఆంధ్రుల విగ్ర‌హాలు తొల‌గించాల‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వ సంస్థ‌లు, విద్యాసంస్థ‌ల‌కు ఉన్న ఆంధ్రుల పేర్ల స్థానంలో తెలంగాణ ప్ర‌ముఖుల […]

తెలంగాణ‌లో ఆంధ్రుల గుర్తులు ఉండ‌టానికి వీల్లేదా?
X
ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత కూడా తెలంగాణ‌లో ఆంధ్రుల విగ్ర‌హాలు ఉండాలా, తెలుగు విశ్వ‌విద్యాల‌యానికి పొట్టి శ్రీరాములు పేర‌నే కొన‌సాగించాలా, తెలంగాణ భాష‌, యాస‌, సంస్కృతిని కించ‌ప‌రిచిన ఆంధ్రుల గుర్తులు ఈ రాష్ట్రంలో ఇంకెంత‌మాత్రం ఉండ‌టానికి వీల్లేద‌ని తెలంగాణ రాష్ట్ర స‌మితి ప్లీన‌రిలో్ తీర్మానం ఆమోదించారు. తెలంగాణ సాంస్కృతిక పున‌రుజ్జీవ‌నం పేరుతో ఆమోదించిన నాలుగో తీర్మ‌నాంలో న‌గ‌రంలో ఉన్న ఆంధ్రుల విగ్ర‌హాలు తొల‌గించాల‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వ సంస్థ‌లు, విద్యాసంస్థ‌ల‌కు ఉన్న ఆంధ్రుల పేర్ల స్థానంలో తెలంగాణ ప్ర‌ముఖుల పేర్లు పెట్టాల‌ని తీర్మ‌నంలో ప్ర‌తిపాదించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ‌విద్యాల‌యం, కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి పార్క్‌, ఎన్‌టీఆర్ పార్క్ వంటి ముఖ్య‌మైన పేర్ల‌ను తీర్మానంలో ప్ర‌స్తావించారు. దీన్ని ప్లీన‌రీలో ఆమోదించారు. అయితే ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాత్రం ఈ తీర్మానంపై ఎటువంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. టీఆర్ ఎస్ ప్లీన‌రీ చేసిన ఈ తీర్మానం ఎటువంటి విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తుందో చూడాలి.
First Published:  25 April 2015 3:23 AM GMT
Next Story