Telugu Global
Others

ప్రత్యేక హోదా కోసం 36 గంట‌ల నుంచి సెల్‌ట‌వ‌ర్‌పై నిర‌స‌న‌

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరులో సెల్‌ టవర్‌ ఎక్కి సంజీవరావు అనే యువ‌కుడు దాదాపు 36 గంటలుగా నిర‌స‌న కొన‌సాగిస్తున్నాడు. పాత గుంటూరు, పెదకాకానీ పోలీసులు, గుంటూరు ఆర్‌డీవో ఆ యువ‌కుడ్ని కిందకు దింపేందుకు చేసిన ప్రయత్నాలు ఫ‌లించ‌లేదు. ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఆర్డీవో భాస్కర నాయుడు… సంజీవరావుతో సెల్‌ఫోన్‌లో మాట్లాడినా ఫ‌లితం లేక‌పోయింది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అందరం కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకువద్దామని కిందికి దిగాల్సిందిగా […]

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరులో సెల్‌ టవర్‌ ఎక్కి సంజీవరావు అనే యువ‌కుడు దాదాపు 36 గంటలుగా నిర‌స‌న కొన‌సాగిస్తున్నాడు. పాత గుంటూరు, పెదకాకానీ పోలీసులు, గుంటూరు ఆర్‌డీవో ఆ యువ‌కుడ్ని కిందకు దింపేందుకు చేసిన ప్రయత్నాలు ఫ‌లించ‌లేదు. ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఆర్డీవో భాస్కర నాయుడు… సంజీవరావుతో సెల్‌ఫోన్‌లో మాట్లాడినా ఫ‌లితం లేక‌పోయింది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అందరం కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకువద్దామని కిందికి దిగాల్సిందిగా కోరారు. అయినా మాట విన‌లేదు. సంఘ‌ట‌న స్థ‌లిలో ఉన్న వ్య‌వ‌సాయ మంత్రి ప్ర‌తిపాటి పుల్లారావు అత‌ని మాట్లాడి ఒప్పించే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ విన‌లేదు. చివ‌రికి సంజీవ‌రావు సెల్ ట‌వ‌ర్ నుంచి కిందికి వ‌చ్చే వ‌ర‌కు తానూ అక్క‌డే ఉంటానని మంత్రి చెప్పారు. ఆ యువ‌కుడి డిమాండ్ల‌లో ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు తన స్వగ్రామం అయిన నెల్లూరు జిల్లా కొండాపూర్‌ మండలం, పార్లపల్లి గ్రామానికి చెక్‌ డామ్ నిర్మించి ఇవ్వాల‌న్న‌ది ఒక‌టి. మంత్రి అంగీకరిస్తూ… దిగిరావాలని కోరారు. తనతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడి హామీ ఇస్తేనే తాను కిందికి దిగుతానని సంజీవరావు భీష్మించాడు. ఈలోగా అత‌ని వ‌ద్ద ఉన్న సెల్‌ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. శ‌నివారం ఉదయం 10 గంటల నుంచి ఆయన సెల్‌ టవర్ మీదే ఉన్నాడు. అన్న‌పానీయాలు లేకుండా అక్క‌డే ఉండి నీర‌సించి పోవ‌డం… సెల్ ఫోన్‌లో ఛార్జింగ్ లేక‌పోవ‌డంతో ఏం జ‌రుగుతుందోన‌ని కింద‌నున్న వారు ఆందోళ‌న చెందుతున్నారు.
First Published:  25 April 2015 6:26 PM GMT
Next Story