Telugu Global
Others

ఆకు కూరలతో జుట్టు నిగనిగ..

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవి మన శరీరాన్నే కాదు జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులంటున్నారు. జుట్టురాలడం, చుండ్రు వంటి సమస్యలను దూరం చేస్తాయట.  – ఒక కప్పు పొన్నగంటి కూర, ఒక కప్పు గోరింటాకు పొడి, రెండు చెంచాల మెంతిపొడి, అరకప్పు పెరుగు, ఒక చెంచా నిమ్మరసం, నీళ్లు కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి 20 నిమిషాల సేపు ఉంచాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి.  […]

ఆకు కూరలతో జుట్టు నిగనిగ..
X
ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవి మన శరీరాన్నే కాదు జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులంటున్నారు. జుట్టురాలడం, చుండ్రు వంటి సమస్యలను దూరం చేస్తాయట.
– ఒక కప్పు పొన్నగంటి కూర, ఒక కప్పు గోరింటాకు పొడి, రెండు చెంచాల మెంతిపొడి, అరకప్పు పెరుగు, ఒక చెంచా నిమ్మరసం, నీళ్లు కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి 20 నిమిషాల సేపు ఉంచాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి.
– చుక్క కూర ఒక కప్పు, గోరింటాకు పొడి, రెండు స్పూన్‌ల ముల్తాన్ మట్టి, కప్పు పెరుగు కలిపి పేస్టు తయారు చేసుకోవాలి. దానిని తలకు బాగా పట్టించి 20 నిమిషాల సేపు ఉంచాలి. దీనివల్ల జుట్టు నిగనిగలాడుతుంది.
– కొద్దిగా మజ్జిగలో చింత చిగురు, కప్పు గోరింటాకు పొడి, అరకప్పు శనగపిండి కలపాలి. తలకు బాగా నూనె రాసుకుని ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇది జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది.
First Published:  25 April 2015 7:17 PM GMT
Next Story