Telugu Global
Others

కుదిపేసిన‌ భూకంపం…నేపాల్‌లో 1500కి పైగా మృతులు

ఉత్త‌ర‌భార‌త దేశాన్ని భూకంపం ఊపేసింది. రిక్ట‌ర్ స్కేలుపై 7.9 ఉన్న ఈ తీవ్ర‌త దాదాపు 1500 మందికి పైగా జ‌నాన్ని పొట్ట‌న పెట్టుకుంద‌ని భావిస్తున్నారు. 970 మంది మృత‌దేహాలు దొరికిన‌ట్టు నేపాల్ ప్ర‌భుత్వం అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. పూరాత‌న క‌ట్ట‌డ‌మైన ‌ద‌ర‌హ‌ర్ స్తంభం కిందే 190 మృత‌దేహాలు వెలికి తీశారు. వివిధ శిథిల భ‌వ‌నాల నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 700 మృత‌దేహాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. శిధిలాల నుంచి శ‌వాల‌ను, క్ష‌త‌గాత్రుల‌ను ఇంకా బ‌య‌ట‌కి తీస్తూనే ఉన్నారు. వేలాది మంది […]

Nepal-eartquake-TOI-350x300ఉత్త‌ర‌భార‌త దేశాన్ని భూకంపం ఊపేసింది. రిక్ట‌ర్ స్కేలుపై 7.9 ఉన్న ఈ తీవ్ర‌త దాదాపు 1500 మందికి పైగా జ‌నాన్ని పొట్ట‌న పెట్టుకుంద‌ని భావిస్తున్నారు. 970 మంది మృత‌దేహాలు దొరికిన‌ట్టు నేపాల్ ప్ర‌భుత్వం అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. పూరాత‌న క‌ట్ట‌డ‌మైన ‌ద‌ర‌హ‌ర్ స్తంభం కిందే 190 మృత‌దేహాలు వెలికి తీశారు. వివిధ శిథిల భ‌వ‌నాల నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 700 మృత‌దేహాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. శిధిలాల నుంచి శ‌వాల‌ను, క్ష‌త‌గాత్రుల‌ను ఇంకా బ‌య‌ట‌కి తీస్తూనే ఉన్నారు. వేలాది మంది క్ష‌త‌గాత్రులు ఆస్ప‌త్రిలో చావుబతుకుల మ‌ధ్య పోరాడుతున్నారు. గాయ‌ప‌డిన కొంత‌మందికి ఆస్ప‌త్రిలో చికిత్స చేయ‌డానికి అనువైన ప‌రిస్థితులు కూడా లేకుండా ఉన్నాయి. ఆస్ప‌త్రిలో బెడ్‌ల‌న్నీ రోగుల‌తో నిండిపోవ‌డంతో కింద‌నే ప‌డుకోబెట్టి చికిత్స చేస్తున్నారు. ఎక్క‌డ చూసినా ఆర్త‌నాదాలు.. హ‌హాకారాలే. ఖాట్మండుకు 83 కిలోమీట‌ర్ల దూరంలో న‌మోదైన ఈ భూకంప ప్ర‌కంప‌న‌లు మొత్తం నేపాల్‌నే అత‌లాకుత‌లం చేశాయి.
pal
10 కిలోమీట‌ర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృత‌మై మొత్తం నేపాల్‌నే అత‌లాకుత‌లం చేసింది. దాదాపు 68 నిమ‌షాల‌పాటు వ‌చ్చిన భూకంపం భారీగా ప్రాణ‌, ఆస్తి న‌ష్టాల్ని మిగిల్చింది. ఇంత‌కుముందెప్పుడూ ఇంత పెద్ద న‌ష్టం నేపాల్‌కు జ‌ర‌గ‌లేదు. రాజ ప్ర‌సాదాలు, పురాత‌న ఆల‌యాలు, క‌ట్ట‌డాలు, గ‌త వైభ‌వాన్ని చాటిచెప్పే క‌ళాఖండాలు మ‌చ్చుకు కూడా అన‌వాళ్ళు లేకుండా పోయాయి. ఒక పెద్ద భూకంపం త‌ర్వాత అనేక ప్ర‌కంప‌న‌లు పుడ‌తాయి…ఇందులో భాగంగానే భూకంపం వ‌చ్చిన స‌మ‌యం నుంచీ ఇప్ప‌టివ‌ర‌కు 20 సార్లు ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి. ఇంకా ఏం ముప్పు జ‌రుగుతుందో తెలియ‌క‌… - ఎప్పుడు ఏ ప్ర‌మాదం ముంచుకొస్తుందోన‌ని తెలియ‌క బాధితులు భ‌య‌ప‌డి పోతున్నారు. సాయంత్రం మ‌ళ్ళీ ఎవ‌రెస్ట్ బేస్ క్యాంపు వ‌ద్ద ప్ర‌కంప‌న‌ల‌కు మంచు చ‌రియ‌లు విరిగిప‌డి 30 మంది ఐస్‌లో కూరుకుపోయి చ‌నిపోయారు. మ‌రో 10 మంది గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. 1934 త‌ర్వాత నేపాల్‌లో సంభ‌వించిన అతి పెద్ద ఉత్పాతం ఇదేన‌ని అధికార‌వ‌ర్గాలు చెబుతున్నాయి. ప‌శుప‌తినాథ్ ఆల‌యంలో ఉన్న ఆశ్రమంలో 30 మంది తెలుగువారు త‌ల‌దాచుకుంటున్నారు.
First Published:  25 April 2015 6:30 PM GMT
Next Story