Telugu Global
Others

తిరులేశుడికి 6 వేల ఎక‌రాల భూములు

తిరుపతి:  తిరుమ‌లేశుని ఆస్తులు ఇపుడు ఎవ‌రైనా తెలుసుకోవ‌చ్చు. ఇప్ప‌టివ‌ర‌కు బ్ర‌హ్మ‌ప‌దార్థంగా ఉన్న శ్రీ‌వారి ఆస్తులు ఇపుడు బ‌య‌ట‌పెట్టారు. శ్రీవారికి ద‌ేశంలోనే కాదు.. నేపాల్‌ వంటి పొరుగు దేశాల్లోనూ వెల కట్టలేని వేల కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా తిరుమలేశుడికి ఉన్న భూముల వివరాలను కలిపితే దాదాపు ఆరు వేల ఎకరాలు ఉన్నాయి. ఇవి కాకుండా, అన్యాక్రాంతమై, టీటీడీకి ప్రైవేటు వ్యక్తులకు కోర్టు వివాదాల్లో ఉన్నవి వందల ఎకరాలు. టీటీడీ ప్రస్తుత ఈవో డాక్టర్‌ సాంబశివరావు చొరవతో ఈ […]

తిరులేశుడికి 6 వేల ఎక‌రాల భూములు
X
తిరుపతి: తిరుమ‌లేశుని ఆస్తులు ఇపుడు ఎవ‌రైనా తెలుసుకోవ‌చ్చు. ఇప్ప‌టివ‌ర‌కు బ్ర‌హ్మ‌ప‌దార్థంగా ఉన్న శ్రీ‌వారి ఆస్తులు ఇపుడు బ‌య‌ట‌పెట్టారు. శ్రీవారికి ద‌ేశంలోనే కాదు.. నేపాల్‌ వంటి పొరుగు దేశాల్లోనూ వెల కట్టలేని వేల కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా తిరుమలేశుడికి ఉన్న భూముల వివరాలను కలిపితే దాదాపు ఆరు వేల ఎకరాలు ఉన్నాయి. ఇవి కాకుండా, అన్యాక్రాంతమై, టీటీడీకి ప్రైవేటు వ్యక్తులకు కోర్టు వివాదాల్లో ఉన్నవి వందల ఎకరాలు. టీటీడీ ప్రస్తుత ఈవో డాక్టర్‌ సాంబశివరావు చొరవతో ఈ వివరాలన్నీ బయటకు వచ్చాయి. టీటీడీ ఆస్తుల వివరాలు పారదర్శకంగా భక్తులందరికీ తెలిసేలా ఉండాల‌ని, అందుకోసం వెబ్‌సైట్‌లో ఉంచాలని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు శ్రీవారి ఆస్తులను క్రోడీకరించారు. సర్వే నెంబర్ల వారీగా వాటిని టీటీడీ వెబ్‌సైట్‌లో ఉంచారు. దేశంలోని తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, పాండిచ్చేరి, కేరళ, ఒడిషా, ఉత్తరాఖండ్‌, న్యూఢిల్లీలతోపాటు నేపాల్‌లోనూ ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిలో అత్యధికంగా వ్యవసాయ భూములున్నాయి. హైదరాబాద్‌, బెంగళూరు, న్యూఢిల్లీ, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లోనూ, నవ్యాంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోను, అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కల్యాణ మండపాలతోపాటు కోట్ల రూపాయల విలువచేసే భవన నిర్మాణ స్థలాలున్నాయి. వీటిని టీటీడీ ప్రాపర్టీసెల్‌ అధికారులు సర్వే నెంబర్లవారీగా వెబ్‌సైట్‌లో ఉంచారు. టీటీడీకి దేశవ్యాప్తంగా 445 స్థిరాస్తులు ఉన్నట్లు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల‌ తర్వాత తమిళనాడులోని ఎక్కువ పట్టణాల్లో శ్రీవారికి స్థిరాస్తులున్నాయి. చెన్నై, మదురై, కడలూరు, తిరునల్వేలి, కన్యాకుమారి నగరాల్లోనూ ఆస్తులున్నట్లు వెబ్‌సైట్‌లో వెల్లడించారు. కర్ణాటకలో బెంగళూరు, మైసూరు, కోలార్‌, బంగారు తిరుపతి వంటి చోట్ల కూడా టీటీడీకి ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. శ్రీవారి ఆస్తులను వెబ్‌సైట్‌లో ఉంచడం ద్వారా కబ్జాలకు తెరపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఎవరైనా కబ్జా చేయాలని ప్రయత్నిస్తే భక్తులే అడ్డుకుని టీటీడీ ప్రాపర్టీ సెల్‌ అధికారులకు సమాచారమిచ్చి అప్రమత్తం చేసే వీలూ ఉంటుందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 12 విభాగాలుగా టీటీడీ భూముల వివరాలను ఉంచారు. భూములు టీటీడీకి ఎలా సంక్రమించాయి? సర్వే నెంబర్లు, డాక్యుమెంట్‌, ఫైల్‌ నెంబర్లతో సహా ఉంచారు. వెబ్‌సైట్‌లో ఉంచిన వివరాల్లో తిరుపతి బ్రాహ్మణపట్టు వ్యవసాయ భూములు, ఎస్వీ యూనివర్సిటీ, వెటర్నరీ వర్సిటీలకు లీజుకు ఇచ్చిన భూములు, అలిపిరి సమీపంలో పల్లివారి పట్టెడ భూములు 4000 ఎకరాలకు పైగా ఉన్నాయి. ఆ తర్వాత కృష్ణా జిల్లా అవనిగడ్డ, నూజివీడుల్లో వ్యవసాయ భూములున్నాయి. ఉత్తరాఖండ్‌లో ప్రముఖ పుణ్యకేత్రాలు రిషికేష్‌, హరిద్వార్‌ల్లోనూ టీటీడీకి ఆశ్రమాలు, స్థలాలు ఉన్నాయని ఈ టీటీడీ వెబ్‌సైట్‌లో తెలిపిన వివ‌రాల్లో ఉంచారు.
First Published:  25 April 2015 7:45 PM GMT
Next Story