Telugu Global
Others

బందరు పోర్టు ఏమైంది..?

బందరు పోర్టు నిర్మాణంలో అధికార పార్టీ రెండు నాల్కల ధోరణిని అవలంభిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోమాట చెబుతూ రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తోంది. వైఎస్ హయాంలో ప్రైవేట్ భూముల సమీకరణకు వ్యతిరేకంగా జరిగిన రైతుల ఉద్యమానికి మద్ధతు పలికిన తెలుగు తమ్ముళ్లు.. నేడు చంద్రబాబు పిలుపునిచ్చిన పూలింగ్ పల్లవిని ఆలపిస్తున్నారు. భూములనే నమ్ముకుని బతుకుతున్నామని, పోర్టు సంగతి దేవుడెరుగు.. తమకున్న సపోర్టు లాగేయ వద్దని రైతులు ఎంత మొత్తుకున్నా అమాత్యులు […]

బందరు పోర్టు ఏమైంది..?
X

బందరు పోర్టు నిర్మాణంలో అధికార పార్టీ రెండు నాల్కల ధోరణిని అవలంభిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోమాట చెబుతూ రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తోంది. వైఎస్ హయాంలో ప్రైవేట్ భూముల సమీకరణకు వ్యతిరేకంగా జరిగిన రైతుల ఉద్యమానికి మద్ధతు పలికిన తెలుగు తమ్ముళ్లు.. నేడు చంద్రబాబు పిలుపునిచ్చిన పూలింగ్ పల్లవిని ఆలపిస్తున్నారు. భూములనే నమ్ముకుని బతుకుతున్నామని, పోర్టు సంగతి దేవుడెరుగు.. తమకున్న సపోర్టు లాగేయ వద్దని రైతులు ఎంత మొత్తుకున్నా అమాత్యులు వారి ఆవేదనను చెవికెక్కించుకోకపోగా .. 1900 ఎకరాలు అప్పనంగా కట్టబెట్టడానికి పావులు కదుపుతున్నారు.

బందరు పోర్టు నిర్మాణం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కదలికలు మొదలెట్టింది. గుత్తేదారుతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 2,288 ఎకరాల ప్రైవేట్ భూములను కట్టబెట్టేందుకు పావులు కదుపుతోంది. బందరు మండలంలోని గోపువానిపాలెం, మేకావారితోట, తవిసిపూడి, మంగినపూడి, కరగ్రహారం, పోతేపల్లి, చిలకలపూడి పరిధిలో సర్వే పనులను వేగవంతం చేసింది. సుమారు 1900 మంది రైతులకు చెందిన భూములను తీసుకోవడానికి అన్ని ప్రయత్నాలూ ప్రారంభమయ్యాయి. ఈ వ్యవహారంలో వీరి అభ్యంతరాలను పక్కనపెడుతోంది.

తమను కూలీలుగా మర్చొద్దని, భూములను తీసుకోవాలనే యోచనను విరమించుకోవాలని బాదిత రైతులు మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్రల ఎదుట ప్రాధేయపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పోర్టు నిర్మాణ సంస్థ నవయుగ కంపెనీకి 5 వేల ఎకరాలకు పైగా కేటాయించటం దారుణమన్నారు. సముద్రం ముఖద్వారంలో ఉన్న భూములను పట్టించుకోకుండా దానికి వ్యతిరేక దిశలో ఉన్న రైతుల భూములు కేటాయించాలని కోరటం సమంజసం కాదన్నారు. కూరగాయలు, ఆకుకూరలు పండించుకునే రైతుల పొట్టగొట్టడం దారుణమన్నారు. మంగినపూడికి ఆనుకుని మరో 3 వేల ఎకరాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భూములు ఉన్నాయని, ఇవి పోర్టుకు అనుకూలమైనవని మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఆ భూములను నిర్మాణ సంస్థకు అప్పగించాలని సూచించారు. అయితే రైతుల అభ్యర్థనను మంత్రులు తోసిపుచ్చారు. బందరులో పోర్టు నిర్మించాలంటే ప్రైవేట్ భూముల సేకరణ తప్పనిసరన్నారు. బాదితులకు అన్యాయం జరగకుండా నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. పోర్టును అడ్డుకోవాలని చూస్తే గుంటూరు జిల్లా ఓడరేవుకు పోర్టు తరలిపోతుందంటూ హెచ్చరిస్తున్నారు.

First Published:  27 April 2015 9:02 AM GMT
Next Story