Telugu Global
Arts & Literature

బలిపీఠంపై అన్నదాత

  ఈ పుస్తక రచయిత బాలాజీ గారు సీనియర్‌ జర్నలిస్ట్‌. పాతికేళ్ళకు పైగా జర్నలిజమ్‌లో ఉన్నారు. కొన్ని వేల వ్యాసాలు రాశారు. భారతదేశంలో రైతుల దుస్థితికి బాధపడి, వాళ్ళ ఆత్మహత్యలకు మనసుచెదిరి, రైతుల సమస్యలపై అధ్యయనం చేసి ఈ వ్యాసాలను రాశారు. రాజకీయనాయకులకు ఓట్లకు రైతులు కావాలి. డబ్బులకు పారిశ్రామిక వేత్తలు కావాలి. రైతులు అమాయకులు కాబట్టి మాయమాటలు చెప్పి ఓట్లేయించుకుంటారు. పారిశ్రామిక వేత్తలు, కార్పోరేట్లు ముదుర్లు కాబట్టి తాము ఇచ్చిన డబ్బుకు పదిరెట్ల విలువైన భూములు […]

Balipetam-pai-annadataఈ పుస్తక రచయిత బాలాజీ గారు సీనియర్‌ జర్నలిస్ట్‌. పాతికేళ్ళకు పైగా జర్నలిజమ్‌లో ఉన్నారు. కొన్ని వేల వ్యాసాలు రాశారు.

భారతదేశంలో రైతుల దుస్థితికి బాధపడి, వాళ్ళ ఆత్మహత్యలకు మనసుచెదిరి, రైతుల సమస్యలపై అధ్యయనం చేసి ఈ వ్యాసాలను రాశారు. రాజకీయనాయకులకు ఓట్లకు రైతులు కావాలి. డబ్బులకు పారిశ్రామిక వేత్తలు కావాలి. రైతులు అమాయకులు కాబట్టి మాయమాటలు చెప్పి ఓట్లేయించుకుంటారు. పారిశ్రామిక వేత్తలు, కార్పోరేట్లు ముదుర్లు కాబట్టి తాము ఇచ్చిన డబ్బుకు పదిరెట్ల విలువైన భూములు ప్రభుత్వం నుంచి కొట్టేస్తారు. ఏదో ఒక పేరు చెప్పి రైతుల నుంచి ప్రభుత్వం భూముల్ని లాక్కుంటుంది. అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, పారిశ్రామికీకరణ పేరు చెప్పి ఈ భూముల్ని కార్పోరేట్లకు కట్టబెడుతుంది. ముడుపులు గుంజుతుంది. ఇది నడుస్తున్న చరిత్ర. దీన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పాడు బాలాజీ.

అలాగే చంద్రబాబు రుణమాఫీ పేరు చెప్పి అధికారానికి వచ్చి రైతుల్ని మోసం చేసిన తీరు, గిట్టుబాటు ధరల మోసం, రైతులకు అవగాహన లేనందువల్ల జరుగుతున్న నష్టం, ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోతున్న వ్యవసాయ అనుబంధ పరిశ్రమల గురించి క్షుణ్ణంగా వివరించాడు.

(బలిపీఠంపై అన్నదాత, రచయిత: ఇ.వి. బాలాజీ,

పేజీలు: 94,

వెల: రూ.50/-,

ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

First Published:  27 April 2015 9:06 PM GMT
Next Story