Telugu Global
Cinema & Entertainment

ఆమె సినిమాలో అందరూ నగ్నంగా నటించాలట..!

బాలీవుడ్ యువ మహిళా నిర్మాత ఏక్తాకపూర్ పెట్టిన సరికొత్త కండిషన్ ఇది. సెన్సేషనల్ సినిమాలకు కేరాఫ్ గా మారిన ఈ కపూర్ బిడ్డ తన నయా మూవీతో సంచలనం అనే పదాన్ని మరింత చిన్నదిగా మార్చేసింది. నగ్నంగా కనిపిస్తాం అనే కండిషన్ పైన సంతకం పెట్టే నటుల్ని మాత్రమే తీసుకుంటానని ప్రకటించి సరికొత్త సంచలనం సృష్టించింది ఏక్తా. త్వరలోనే బాలీవుడ్ లో ట్రిపుల్ ఎక్స్ అనే సినిమాను తెరకెక్కించాలనుకుంటోంది ఏక్తాకపూర్. యూరోపియన్ దర్శకుడు ఫాసిబిందర్ గతంలో ఒక […]

ఆమె సినిమాలో అందరూ నగ్నంగా నటించాలట..!
X

బాలీవుడ్ యువ మహిళా నిర్మాత ఏక్తాకపూర్ పెట్టిన సరికొత్త కండిషన్ ఇది. సెన్సేషనల్ సినిమాలకు కేరాఫ్ గా మారిన ఈ కపూర్ బిడ్డ తన నయా మూవీతో సంచలనం అనే పదాన్ని మరింత చిన్నదిగా మార్చేసింది. నగ్నంగా కనిపిస్తాం అనే కండిషన్ పైన సంతకం పెట్టే నటుల్ని మాత్రమే తీసుకుంటానని ప్రకటించి సరికొత్త సంచలనం సృష్టించింది ఏక్తా. త్వరలోనే బాలీవుడ్ లో ట్రిపుల్ ఎక్స్ అనే సినిమాను తెరకెక్కించాలనుకుంటోంది ఏక్తాకపూర్. యూరోపియన్ దర్శకుడు ఫాసిబిందర్ గతంలో ఒక సినిమా తీసాడు. ఆ సినిమాలో ఎవ్వరికీ ఒంటి మీద నూలుపోగు ఉండదు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు అందరూ పూర్తి నగ్నంగా కనిపిస్తారు. బహుశ ఫాసిబిందర్ ఆదర్శంగా ఎక్తాకపూర్ ఇలాంటి ప్రయత్నానికి పూనుకొని ఉండవచ్చు.

కెన్ ఘోష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో 5 కథలుంటాయి. ప్రతి కథ మరో కథతో కనెక్ట్ అవుతూ.. క్లయిమాక్స్ వరకు భలే రంజుగా సాగుతుంది. అయితే ప్రతి కథలో నగ్నంగా కొన్ని సీన్లు ఉంటాయి. అందుకే సినిమాకి ట్రిపుల్ ఎక్స్ అని పేరుపెట్టింది ఏక్తా. కాబట్టి.. ఇలా నగ్నంగా నటించే ఒప్పందం మీదే నటీనటుల్ని తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే ప్రాజెక్ట్ పై సంతకం పెట్టిన తర్వాత నగ్నంగా నటించమని మొండికేస్తే మొదటికే మోసం వస్తుంది కాబట్టి.. నటీనటులందరికీ అగ్రిమెంట్ లో ఈ క్లాజ్ చేర్చేసింది ఏక్తాకపూర్. దీంతో ఎవరూ ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ పై సంతకం పెట్టలేదు. భారీగా ముట్టజెపుతామని ఊరించినప్పటికీ ఎవరూ ముందుకురాలేదు. చివరికి పోర్న్ స్టార్ సన్నీలియోన్ కూడా వెనక్కి తగ్గిందంటే.. ట్రిపుల్ ఎక్స్ కథ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎట్టకేలకు ఈ సినిమాలో నటించేందుకు తొలి సంతకం చేసింది కైరా దత్. కింగ్ ఫిషర్ మోడల్ గా ఇప్పటికే బీభత్సమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న కైరా, ట్రిపుల్ ఎక్స్ సినిమాలో నగ్నంగా నటించేందుకు ఒప్పుకుంది. అంతేకాదు.. కైరాని పెట్టి నగ్నంగా కొన్ని సీన్లు కూడా తీశారు. మరి కైరాను ఆదర్శంగా తీసుకొని ఇంకెంతమంది నటులు ముందుకొస్తారో చూడాలి. నటీనటులంతా సమకూరిన తర్వాతే కదా సినిమా పూర్తయ్యేది. ఇదొక ఎత్తయితే.. సినిమా సిద్ధమయ్యాక దానికి సెన్సార్ పూర్తవుతుందా కాదా అనే సందేహాలు కూడా ఇప్పట్నుంచే మొదలయ్యాయి. మొత్తమ్మీద ఏక్తాకపూర్ కోట్ల రూపాయల పెట్టుబడితో కత్తిమీద సాము చేస్తోంది.

First Published:  28 April 2015 3:26 AM GMT
Next Story