Telugu Global
Cinema & Entertainment

రథం ఎక్కడానికి మొరాయిస్తున్న బన్నీ

అల్లు అర్జున్-బోయపాటి శ్రీను సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ కేకులా మారింది. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాతో బన్నీ మార్కెట్ పెంచుకున్నాడు. లెజెండ్ సినిమాతో బోయపాటి స్టార్ అయిపోయాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అది అంచనాలకు అందనంత ఎత్తులో ఉంటుంది. ఇప్పుడవే అంచనాలు సినిమా టైటిల్ పై పడ్డాయి. బన్నీ-బోయపాటి సినిమాకు రథం అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో సినిమా యూనిట్ రంగంలోకి దిగి ఆ ప్రచారాన్ని ఖండించింది. తమ సినిమాకు […]

రథం ఎక్కడానికి మొరాయిస్తున్న బన్నీ
X
అల్లు అర్జున్-బోయపాటి శ్రీను సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ కేకులా మారింది. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాతో బన్నీ మార్కెట్ పెంచుకున్నాడు. లెజెండ్ సినిమాతో బోయపాటి స్టార్ అయిపోయాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అది అంచనాలకు అందనంత ఎత్తులో ఉంటుంది. ఇప్పుడవే అంచనాలు సినిమా టైటిల్ పై పడ్డాయి. బన్నీ-బోయపాటి సినిమాకు రథం అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో సినిమా యూనిట్ రంగంలోకి దిగి ఆ ప్రచారాన్ని ఖండించింది. తమ సినిమాకు రథం అనే టైటిల్ కాకుండా మరో పవర్ ఫుల్ పేరు కోసం వెదుకుతున్నామని ప్రకటించింది.
టైటిల్ తో పాటు బన్నీ లుక్ పై కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. బన్నీ ఈ సినిమాలో కాస్త లావుగా కండపట్టి పుష్టిగా కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది. దీన్ని మాత్రం సినిమా యూనిట్ సమర్థించింది. కథకు తగ్గట్టు బన్నీ కండలుతిరిగి కాస్త బలిష్టంగా కనిపించాలి కాబట్టి.. ఇప్పట్నుంచే తమ హీరో ఆహారపు అలవాట్లు మార్చుకున్నాడని చెబుతోంది. మరోవైపు హీరోయిన్లపై కూడా సినిమా యూనిట్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. మొదట్లో స్టార్ హీరోయిన్లను ఇద్దర్ని తీసుకుందామనుకున్నారు. కానీ ఇప్పుడు ఇద్దర్నీ కొత్తవాళ్లనే సెలక్ట్ చేసుకున్నారు. జాదూగాడు సినిమాలో హీరోయిన్ గా నటించిన సోనారికాను ఒక హీరోయిన్ గా సెలక్ట్ చేస్తే.. మిస్టర్ ఎక్స్ సినిమాలో నటించిన అమిరా డస్టర్ ను మరో హీరోయిన్ గా ఎన్నుకున్నారు.
అయితే అన్నీ సెట్ అయ్యాయి కానీ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనేది మాత్రం ఇంకా తేలలేదు. ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకొస్తాం అని చెబుతున్నారు తప్ప, అది ఎప్పుడనే క్లారిటీ మాత్రం ఇవ్వట్లేదు. అన్నట్టు ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ ను కాకుండా తమన్ ను మ్యూజిక్ డైరక్టర్ గా సెలక్ట్ చేసుకున్నారు.
First Published:  28 April 2015 12:59 AM GMT
Next Story