Telugu Global
Cinema & Entertainment

క‌మ‌ల్ హాస‌న్ కు కోపం వ‌చ్చిందా..?

న‌టుడిగా..ద‌ర్శ‌కుడిగా అత్యంత ప్ర‌తిభావంత‌డైన ఫిల్మ్ మేక‌ర్స్ లో లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కూడా ఒక‌రు అని చెప్పడంలో ఎటువంటి అతిశ‌యోక్తి లేదు.   అయితే ద‌ర్శ‌కుడిగా క‌మ‌ల్ చేసిన సినిమాలన్నీ  మొద‌టి నుంచి  కాంట్ర‌వ‌ర్స‌రి గండాన్ని ఎదుర్కొంటు వ‌స్తూన్నాయి. రెండు సంవ‌త్స‌రాల క్రితం వ‌చ్చిన విశ్వ‌రూపం సినిమా ఎన్నో వివాదాలను  ఇంట బ‌య‌ట ఫేస్ చేసింది. ఒక ద‌శ‌లో సినిమా రిలీజ్ కే క‌ష్ట‌మైంది.  అయితే దేశ వ్యాప్తంగా మీడియా క‌మల్ కు అండ‌గ నిల‌వ‌డంతో […]

క‌మ‌ల్ హాస‌న్ కు కోపం వ‌చ్చిందా..?
X
న‌టుడిగా..ద‌ర్శ‌కుడిగా అత్యంత ప్ర‌తిభావంత‌డైన ఫిల్మ్ మేక‌ర్స్ లో లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కూడా ఒక‌రు అని చెప్పడంలో ఎటువంటి అతిశ‌యోక్తి లేదు. అయితే ద‌ర్శ‌కుడిగా క‌మ‌ల్ చేసిన సినిమాలన్నీ మొద‌టి నుంచి కాంట్ర‌వ‌ర్స‌రి గండాన్ని ఎదుర్కొంటు వ‌స్తూన్నాయి. రెండు సంవ‌త్స‌రాల క్రితం వ‌చ్చిన విశ్వ‌రూపం సినిమా ఎన్నో వివాదాలను ఇంట బ‌య‌ట ఫేస్ చేసింది. ఒక ద‌శ‌లో సినిమా రిలీజ్ కే క‌ష్ట‌మైంది. అయితే దేశ వ్యాప్తంగా మీడియా క‌మల్ కు అండ‌గ నిల‌వ‌డంతో ఎట్ట‌కేల‌కు జ‌య‌ల‌లిత సినిమా రిలీజ్ కు అనుమంతించ‌క త‌ప్ప‌లేదు.
ఇక తాజాగా క‌మ‌ల్ న‌టించి , స్టోరి అండ్ స్క్రీన్ ప్లే అందించిన ఉత్త‌మ విల‌న్ సినిమా కు సంబంధించి ప‌లు కేసులు కోలీవుడ్ లో పెట్టారు. అయితే క‌మ‌ల్ హాస‌న్ దీనికి సంబంధించి ఘూటుగా స్పందించారు. త‌ను రాజ‌కీయాల‌కు స‌పోర్ట్ చేస్తున్న‌ న‌టుడిని కాద‌ని.. అలాగే ఏదో ఒక వ‌ర్గం వారిని హైలెట్ చేస్తూ సినిమాలు చేసే ద‌ర్శ‌కుడిని అసలే కాద‌ని చెప్పారు. క‌ళా కారుడిగా త‌న క‌థ డిమాండ్ మేర‌కే చేస్తాను త‌ప్ప‌.. ఎవ‌ర్ని స‌పోర్ట్ చేయ‌డానికో..లేక విమ‌ర్శించ‌డానికి చిత్రాలు చేయ‌న‌ని చెప్పారు. త‌న గురువు బాల‌చంద‌ర్ నేర్పించిన ప‌ద్ద‌తిలోనే త‌న చిత్రాలుంటాయిని తెలిపారు. సున్నిత‌మైన అంశాలు ఎంచుకోవ‌డంతో త‌న చిత్రాలు వివాదం అవుతుంటాయని చాలా మంది అంటుంటారు. అయితే అది త‌న తప్పు కాదని అన్నారు. ఇక త‌న చిత్రాల‌కు అడ్డు ప‌డే వారి సంఖ్య కూడా చాలా త‌క్కువుగానే వుంటుంది ..దాని గురించి అభిమానులు బాధ ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని క్లారీటి ఇచ్చారు. ఇలాంటి వారికి ఎప్పుడు స్నేహాస్తం అందించ‌డ‌మే ప్రజా స్వామ్యానికి నిజమైన అర్ధమని చెప్పారు.
ఇక ఉత్త‌మ విల‌న్ చిత్రం త‌న ఫ్రెండ్ ర‌మేష్ అర‌విండ్ డైరెక్ట్ చేశారు. పూజ కుమార్, ఆండ్రియా హీరోయిన్స్ గా న‌టించారు. త‌న గురుతుల్యులైన ద‌ర్శ‌క దిగ్గ‌జాలు కే బాల‌చందర్ మరియు క‌ళా త‌ప‌స్పీ కే విశ్వ‌నాథ్ ఇద్దరు ఈ చిత్రంలో న‌టించారు. జిబ్రాన్ అందించిన మ్యూజిక్ క‌చ్చితంగా సినిమాకు ఒక ప్ల‌స్ పాయింట్ అవుతుంది. తెలుగు లో మెగా ప్రొడ్యూస‌ర్ సి క‌ళ్యాణ్ రిలీజ్ చేస్తున్నారు.
First Published:  28 April 2015 4:30 AM GMT
Next Story