Telugu Global
Cinema & Entertainment

ఓవర్సీస్ లో కూడా ఓకే

తెలుగు-తమిళ భాషల్లో సూపర్ హిట్టయింది ఓకే బంగారం సినిమా. సూపర్ హిట్ అని ఎందుకు అంటున్నామంటే పెట్టిన ఖర్చుకు మూడింతలు లాభాలొచ్చాయి కాబట్టి. పైగా రెండు వారాలు గడిచినప్పటికీ ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది కాబట్టి. ఈ రెండు అంశాల ప్రాతిపదికన ఓకే బంగారం సినిమా సూపర్ హిట్ అయిపోయింది. కేవలం తమిళ-తెలుగు భాషల్లోనే కాకుండా.. ఇప్పుడు ఓవర్సీస్ లో కూడా ఓకే బంగారం ఓకే అనిపించుకుంది.  ఇంతకుముందు మణిరత్నం తీసిన కడలి, రావణ్ […]

ఓవర్సీస్ లో కూడా ఓకే
X
తెలుగు-తమిళ భాషల్లో సూపర్ హిట్టయింది ఓకే బంగారం సినిమా. సూపర్ హిట్ అని ఎందుకు అంటున్నామంటే పెట్టిన ఖర్చుకు మూడింతలు లాభాలొచ్చాయి కాబట్టి. పైగా రెండు వారాలు గడిచినప్పటికీ ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది కాబట్టి. ఈ రెండు అంశాల ప్రాతిపదికన ఓకే బంగారం సినిమా సూపర్ హిట్ అయిపోయింది. కేవలం తమిళ-తెలుగు భాషల్లోనే కాకుండా.. ఇప్పుడు ఓవర్సీస్ లో కూడా ఓకే బంగారం ఓకే అనిపించుకుంది.
ఇంతకుముందు మణిరత్నం తీసిన కడలి, రావణ్ సినిమాలు ఓవర్సీస్ లో అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అట్టర్ ఫ్లాప్ అనే పదం కంటే ఇంకా పెద్ద పదం ఏదైనా ఉంటే బాగుందనిపిస్తుంది ఈ రెండు సినిమాల విషయంలో. ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ లాంటి స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ ఓవర్సీస్ లో రావణ్ సినిమా ఆడలేదు. వసూళ్లు చాలా ఘోరంగా వచ్చాయి. ఇక కడలి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ. అమెరికా నుంచి ఇండియాకు వెళ్లిరావడానికి అయ్యేంత ఖర్చును కూడా కడలి సినిమా ఓవర్సీస్ లో రాబట్టలేకపోయింది. ఇలాంటి రెండు ఘోర పరాజయాల తర్వాత వచ్చిన ఓకే బంగారం సినిమా విదేశాల్లో మెరిసింది. తాజా సమాచారం ప్రకారం రెండు వారాలు ముగిసేనాటికి ఓకే బంగారం ఓవర్సీస్ లో దాదాపు 3లక్షల 40వేల డాలర్లు ఆర్జించింది. అంటే దాదాపు రెండున్నర కోట్లు అన్నమాట. సో.. ఓవర్సీస్ లో కూడా ఓకే బంగారం ఓకే అనిపించుకున్నట్టే కదా..
First Published:  28 April 2015 7:15 AM GMT
Next Story