ఈసారైనా హిట్ కొడతాడా..

వరుస ఫ్లాపులతో బాగా డీలాపడిపోయాడు హీరో రామ్. అందుకే ఈసారి ఎలాగైనా పండగ చేస్కోవాలనే ఉద్దేశంతో పండగ చేస్కో సినిమాని సిద్ధంచేశాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ గ్యాప్ లో సినిమా పాటలతో పండగ చేసుకుందామని డిసైడ్ అయ్యాడు రామ్. మే 1న తన కొత్త సినిమా పాటల్ని విడుదల చేయాలని అనుకుంటున్నారు. తమన్ స్వరపరిచిన పాటలు కెవ్వుకేక అంటూ ఇప్పటికే ఊదరగొట్టేస్తున్నాడు ఈ యంగ్ హీరో. మరి ఆ పాటలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే మే డే వరకు ఆగాల్సిందే. సినిమాలో రామ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. రామ్ గత సినిమాలు రెండూ బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడ్డాయి. ఎన్నో ఆశలతో చేసిన ఒంగోలు గిత్త సినిమా పత్తా లేకుండా పోయింది. ఆ తర్వాత భారీ అంచనాల మధ్య చేసిన మసాలా సినిమా చప్పగా ఉందనే టాక్ తో ముగిసింది. ఇలా రెండు డెడ్లీ ఫ్లాప్స్ తర్వాత పండగ చేస్కో అంటూ మరోసారి మనముందుకొస్తున్నాడు రామ్. మరి ఈ సినిమాతో రామ్, పండగ చేసుకుంటాడో లేదో తెలియాలంటే మూవీ విడుదల వరకు ఆగాల్సిందే.