Telugu Global
Others

ఏపీలో గిరిజ‌న ఆశ్ర‌మ‌పాఠ‌శాల‌లు ప్ర‌యివేటు ప‌రం..

 ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి ప్ర‌యివేటీక‌ర‌ణ చేయ‌డ‌మంటే చాలా ఇష్టం. ప్ర‌భుత్వ‌మంటే ప్ర‌యివేటు సంస్థ‌ల‌తో కలిసి ప‌నిచేస్తేనే స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుంద‌ని ఆయ‌న న‌మ్ముతారు. గ‌తంలో తొమ్మిదేళ్ళ పాల‌న కూడా అదేరీతిగా సాగింది. రాజ‌ధాని అమ‌రావ‌తి న‌గ‌రాన్ని కూడా పూర్తిగా సింగ‌పూర్ సంస్థ‌ల‌తోనే నిర్మించాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు. రాష్ట్రంలోని ఒక్కో సంస్థ‌ను మెల్ల‌గా ప్ర‌యివేటు సంస్థ‌ల చేతుల్లో పెట్ట‌డానికి ప‌థ‌కాలు సిద్ధం చేశారు. ముందుగా గిరిజ‌న సంక్షేమ శాఖ‌లోని ఆశ్ర‌మ పాఠ‌శాల‌ల్ని ప్ర‌యివేటుప‌రం చేయ‌డానికి ప్లాన్ రెడీ అయింది. గిరిజ‌న‌సంక్షేమ […]

ఏపీలో గిరిజ‌న ఆశ్ర‌మ‌పాఠ‌శాల‌లు ప్ర‌యివేటు ప‌రం..
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి ప్ర‌యివేటీక‌ర‌ణ చేయ‌డ‌మంటే చాలా ఇష్టం. ప్ర‌భుత్వ‌మంటే ప్ర‌యివేటు సంస్థ‌ల‌తో కలిసి ప‌నిచేస్తేనే స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుంద‌ని ఆయ‌న న‌మ్ముతారు. గ‌తంలో తొమ్మిదేళ్ళ పాల‌న కూడా అదేరీతిగా సాగింది. రాజ‌ధాని అమ‌రావ‌తి న‌గ‌రాన్ని కూడా పూర్తిగా సింగ‌పూర్ సంస్థ‌ల‌తోనే నిర్మించాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు. రాష్ట్రంలోని ఒక్కో సంస్థ‌ను మెల్ల‌గా ప్ర‌యివేటు సంస్థ‌ల చేతుల్లో పెట్ట‌డానికి ప‌థ‌కాలు సిద్ధం చేశారు. ముందుగా గిరిజ‌న సంక్షేమ శాఖ‌లోని ఆశ్ర‌మ పాఠ‌శాల‌ల్ని ప్ర‌యివేటుప‌రం చేయ‌డానికి ప్లాన్ రెడీ అయింది. గిరిజ‌న‌సంక్షేమ శాఖ‌లో ఉద్యోగుల కొర‌త వేధిస్తోంద‌ని అందువ‌ల్ల ఆశ్ర‌మ పాఠ‌శాల‌ల్ని అవుట్ సోర్సింగుకు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిషోర్‌బాబు స్వ‌యంగా చెప్పారు. ప్ర‌భుత్వ అజ‌మాయిషీలో ఉంటేనే గిరిజ‌న బాల‌ల ప‌రిస్థితి అత్యంత దుర్భరంగా ఉంటోంది. గిరిజ‌నులంటే ఎవ‌రికీ అక్క‌ర్లేదు. వారి ఓట్లు కూడా పెద్ద‌గా ఉపయోగ‌ప‌డ‌వు. అందుకే కొత్త చంద్ర‌బాబు ముందుగా గిరిజ‌న బాల‌ల మీదే ప్ర‌యివేటీక‌ర‌ణ అస్త్రం ప్ర‌యోగించ‌డానికి సిద్ధ‌మయ్యారు.
First Published:  28 April 2015 8:16 AM GMT
Next Story