Telugu Global
Cinema & Entertainment

గంగ విడుదలకు మార్గం సుగమం

ఎంతో కష్టపడి రాఘవ లారెన్స్ తెరకెక్కించిన గంగ సినిమా తెలుగులో ఇప్పటివరకు విడుదలకాలేదు. ఆర్థికపరమైన అంశాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో గంగ సినిమా అనుకోని విధంగా వాయిదా పడింది. తమిళ్ లో మాత్రం కాంచన-2గా విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. కోలీవుడ్ లో సక్సెస్ టాక్ రావడంతో టాలీవుడ్ లో ఎలాగైనా గంగను విడుదల చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఫైనాన్షియల్ సెటిల్ మెంట్లు అన్నీ పూర్తిచేసి.. మే 1న గంగ సినిమాను గ్రాండ్ గా […]

గంగ విడుదలకు మార్గం సుగమం
X
ఎంతో కష్టపడి రాఘవ లారెన్స్ తెరకెక్కించిన గంగ సినిమా తెలుగులో ఇప్పటివరకు విడుదలకాలేదు. ఆర్థికపరమైన అంశాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో గంగ సినిమా అనుకోని విధంగా వాయిదా పడింది. తమిళ్ లో మాత్రం కాంచన-2గా విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. కోలీవుడ్ లో సక్సెస్ టాక్ రావడంతో టాలీవుడ్ లో ఎలాగైనా గంగను విడుదల చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఫైనాన్షియల్ సెటిల్ మెంట్లు అన్నీ పూర్తిచేసి.. మే 1న గంగ సినిమాను గ్రాండ్ గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాత బెల్లంకొండ సురేష్. అన్నీ తానై రాఘవ లారెన్స్ తెరకెక్కించిన ఈ సినిమాలో లక్ష్మీరాయ్, తాప్సి, నిత్యామీనన్ కీలక పాత్రలు పోషించారు. ఇదే సినిమాని తాప్సి, హిందీలో కూడా రీమేక్ చేయాలనుకుంటోంది. అందుకే హిందీ మూవీ రైట్స్ కూడా దక్కించుకుంది. మొత్తానికి చాన్నాళ్ల గ్యాప్ తర్వాత లారెన్స్ మరో హిట్ కొట్టాడు. తెలుగులో ఇది ఏ రేంజ్ లో ఆడుతుందో చూడాలి.
First Published:  29 April 2015 7:00 AM GMT
Next Story