మరోసారి వార్తల్లోకెక్కిన బాలయ్య హీరోయిన్

రాధికా ఆప్టే.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. బాలయ్య సినిమాలో నటించడం వల్ల టాలీవుడ్ లో కూడా ఈమెకి పాపులారిటీ పెరిగింది. అయితే పాపులారిటీతో పాటు వివాదాలు కూడా ఈ భామకు కాస్త ఎక్కువే. వివాదాస్పద వ్యాఖ్యలతో ఆమధ్య వార్తల్లోకెక్కిన రాధికా ఆప్టే.. ఇప్పుడు ఏకంగా ఓ mmsతో వార్తల్లోకెక్కింది. అవును.. రాధికా నటించిన ఓ న్యూడ్ క్లిప్ ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఆ నగ్నదృశ్యంలో నటించింది రాధికానే అయినప్పటికీ ముందే అలా అది లీకవ్వడంతో యూనిట్ అవాక్కయింది. ఓ షార్ట్ ఫిలిం షూటింగ్ కోసం దర్శకుడు అనురాగ్ కశ్యప్, రాధికతో ఆ నగ్న సన్నివేశాన్ని తెరకెక్కించాడు. షూటింగ్ చేసి, ఎడిటింగ్ చేసింది కూడా మహిళలే. అయినప్పటికీ ఆ 11 సెకెన్ల క్లిప్ లీకైపోయింది. దీనిపై సీరియస్ అయిన దర్శకుడు పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు. ఎలాగైనా ఆ సీన్ ను నెట్ నుంచి తొలిగించేలా చర్యలు తీసుకోవాలని కోరాడు. మొత్తానికి 11 సెకెన్ల mmsతో జాతీయస్థాయిలో పాపులర్ అయిపోయింది రాధికా.