Telugu Global
National

రాహుల్ ది లీడ‌ర్‌..

కాంగ్రెస్ యువ‌రాజుగా కీర్తించ‌బడుతున్న రాహుల్‌గాంధీ మారాడు. రెండు నెల‌ల పాటు విపాస‌న ధ్యానం అభ్య‌సించి తిరిగివ‌చ్చిన రాహుల్‌లో చాలా మార్పు వ‌చ్చింది. భూ సేక‌ర‌ణ బిల్లు వ్య‌వ‌హారం ఆయ‌న నాయ‌క‌త్వానికి ప‌రీక్ష పెడుతోంది. దీన్నొక స‌వాల్‌గా తీసుకున్న రాహుల్ కిసాన్ ర్యాలీలోను, లోక్‌స‌భ‌లోను ప్ర‌భుత్వాన్ని దులిపేశారు. ఇప్ప‌డు దేశ‌వ్యాప్తంగా రైతుల స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డానికి ప్ర‌యాణ‌మ‌వుతున్నారు. ముందుగా ఢిల్లీకి కూత‌వేటు దూరంలో ఉన్న పంజాబ్ రైతుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి జ‌న‌ర‌ల్ బోగీలో సాధార‌ణ పౌరుడిలా ప్ర‌యాణం  చేసి రైతుల వ‌ద్ద‌కు […]

రాహుల్ ది లీడ‌ర్‌..
X
కాంగ్రెస్ యువ‌రాజుగా కీర్తించ‌బడుతున్న రాహుల్‌గాంధీ మారాడు. రెండు నెల‌ల పాటు విపాస‌న ధ్యానం అభ్య‌సించి తిరిగివ‌చ్చిన రాహుల్‌లో చాలా మార్పు వ‌చ్చింది. భూ సేక‌ర‌ణ బిల్లు వ్య‌వ‌హారం ఆయ‌న నాయ‌క‌త్వానికి ప‌రీక్ష పెడుతోంది. దీన్నొక స‌వాల్‌గా తీసుకున్న రాహుల్ కిసాన్ ర్యాలీలోను, లోక్‌స‌భ‌లోను ప్ర‌భుత్వాన్ని దులిపేశారు. ఇప్ప‌డు దేశ‌వ్యాప్తంగా రైతుల స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డానికి ప్ర‌యాణ‌మ‌వుతున్నారు. ముందుగా ఢిల్లీకి కూత‌వేటు దూరంలో ఉన్న పంజాబ్ రైతుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి జ‌న‌ర‌ల్ బోగీలో సాధార‌ణ పౌరుడిలా ప్ర‌యాణం చేసి రైతుల వ‌ద్ద‌కు వెళ్ళారు. ఆసియాలోనే పెద్ద‌ద‌యిన ఖ‌న్నా మార్కెట్ యార్డ్‌తో స‌హా ప‌లు మార్కెట్ యార్డ్‌ల వ‌ద్ద‌కు వెళ్ళి అక్క‌డి గోధుమ‌, వ‌రి రైతుల‌ను ప‌రామ‌ర్శించారు. వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. ధాన్యం సేక‌ర‌ణ ఎలా ఉంద‌ని ఆరా తీసి, ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను విమ‌ర్శించారు. మొత్తం మీద రాహుల్ రాజ‌కీయ నాయ‌కుడు అనిపించుకోవ‌డానికి చాలా తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. రాహుల్‌లోవ‌చ్చిన ఈ మార్పు చూసి కాంగ్రెస్ నేత‌లు ఉబ్బి త‌బ్బిబ్బ‌వుతున్నారు. త‌మ‌కు ఇక నాయ‌క‌త్వం లేని లోటు తీరుతుంద‌ని ఆశిస్తున్నారు.
First Published:  28 April 2015 9:18 PM GMT
Next Story