Telugu Global
Cinema & Entertainment

బంగారాన్ని ఓకే అనేసిన సూపర్ స్టార్ 

మంచి సినిమా కనిపిస్తే మెచ్చుకోకుండా ఉండలేదు సూపర్ స్టార్ రజనీకాంత్. అందులో హీరో ఎవరు, దర్శకుడు ఎవరు అనే విషయాలతో సంబంధం లేకుండా ఫోన్ చేసి మరీ మెచ్చుకుంటాడు. కుదిరితే కలిసి శుభాకాంక్షలు చెబుతాడు. ఓకే బంగారం విషయంలో కూడా అదే జరిగింది. తెలుగు-తమిళ భాషల్లో సూపర్ హిట్టయిన ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించాడు రజనీకాంత్. సినిమాను ఆసాంతం చూసిన సూపర్ స్టార్, మూవీ బ్రహ్మాండంగా ఉందంటూ మణిరత్నాన్ని మెచ్చుకున్నారు. ఇంత బాగా ఎలా అప్ డేట్ […]

బంగారాన్ని ఓకే అనేసిన సూపర్ స్టార్ 
X
మంచి సినిమా కనిపిస్తే మెచ్చుకోకుండా ఉండలేదు సూపర్ స్టార్ రజనీకాంత్. అందులో హీరో ఎవరు, దర్శకుడు ఎవరు అనే విషయాలతో సంబంధం లేకుండా ఫోన్ చేసి మరీ మెచ్చుకుంటాడు. కుదిరితే కలిసి శుభాకాంక్షలు చెబుతాడు. ఓకే బంగారం విషయంలో కూడా అదే జరిగింది. తెలుగు-తమిళ భాషల్లో సూపర్ హిట్టయిన ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించాడు రజనీకాంత్. సినిమాను ఆసాంతం చూసిన సూపర్ స్టార్, మూవీ బ్రహ్మాండంగా ఉందంటూ మణిరత్నాన్ని మెచ్చుకున్నారు. ఇంత బాగా ఎలా అప్ డేట్ అయ్యాడంటూ ఒకింత ఆశ్చర్యపోయారు కూడా. ఓకే బంగారం లాంటి సెన్సిబుల్ మూవీస్ మరిన్ని తీయాలని ఆకాంక్షించారు రజనీకాంత్. ఈ స్పెషల్ స్క్రీనింగ్ లో రజనీతో పాటు అతడి అల్లుడు ధనుష్, దర్శకుడు మణిరత్నం, మణి భార్య సుహాసిని పాల్గొన్నారు. దుల్కర్-నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కింది ఓకే బంగారం. విడుదలైన మొదటి రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నాయి. సినిమా విడుదలై 2 వారాలు గడిచినా ఇంకా బాక్సాఫీస్ ముందు స్టడీగా కొనసాగుతోంది ఓకే బంగారం.
First Published:  28 April 2015 11:49 PM GMT
Next Story