మే 31న ఘట్టమనేని పండగ

తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమాకు సంబంధించిన ఏదో ఒక ఫస్ట్ లుక్, టీజర్ లేదా ట్రయిలర్ ను విడుదలచేయడం మహేష్ బాబుకు అలవాటు. ఈసారి కూడా అదే పద్దతి ఫాలో అవుతున్నాడు ప్రిన్స్. మే 31 కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు, మహేష్ నయా లుక్ ను కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తారు. ప్రస్తుతం శ్రీమంతుడు షూటింగ్ మలేషియాలో జరుగుతోంది. వచ్చేనెల 3న యూనిట్ అంతా ఇండియా తిరిగొస్తుంది. తర్వాత హైదరాబాద్ లో కూడా మరో షెడ్యూల్ ఉంటుంది. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, సుకన్య లాంటి సీనియర్ నటులు నటిస్తున్నారు ఈ సినిమాలో. మహేష్ కు తల్లిగా సుకన్య కనిపించనుంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.