Telugu Global
Cinema & Entertainment

కాజోల్‌,షారుక్‌  రీపీట్ చేయ‌గ‌ల‌గుతారా..?

బాలీవుడ్ లో దిలిప్ కుమార్ త‌రువాత  కింగ్ ఆఫ్ రొమాన్స్ అనిపించుకున్నఘ‌నత  ఇప్ప‌టి స్టార్ హీరోల్లో షారుక్ ఖాన్ కే ద‌క్కింది.  కెరీర్ ప్రారంభంలో  య‌శ్ చోప్రా బ్యాన‌ర్ లో  ఆదిత్య చోప్రా చేసిన  దిల్ వాలే దుల్హ‌నియ లేజాయింగే చిత్రం షారుక్ , కాజ‌ల్  ఫిల్మ్ కెరీర్ ను  స్థిర పరిచింది.  అంత‌కు మించి వీరిద్ద‌రిని బెస్ట్ ఆన్ స్క్రీన్  క‌పుల్ గా  ప్రేక్ష‌కులు ముద్ర వేశారు.  ఈ చిత్రంలో  షారుక్ ,  కాజోల్ ల […]

కాజోల్‌,షారుక్‌  రీపీట్ చేయ‌గ‌ల‌గుతారా..?
X
బాలీవుడ్ లో దిలిప్ కుమార్ త‌రువాత కింగ్ ఆఫ్ రొమాన్స్ అనిపించుకున్నఘ‌నత ఇప్ప‌టి స్టార్ హీరోల్లో షారుక్ ఖాన్ కే ద‌క్కింది. కెరీర్ ప్రారంభంలో య‌శ్ చోప్రా బ్యాన‌ర్ లో ఆదిత్య చోప్రా చేసిన దిల్ వాలే దుల్హ‌నియ లేజాయింగే చిత్రం షారుక్ , కాజ‌ల్ ఫిల్మ్ కెరీర్ ను స్థిర పరిచింది. అంత‌కు మించి వీరిద్ద‌రిని బెస్ట్ ఆన్ స్క్రీన్ క‌పుల్ గా ప్రేక్ష‌కులు ముద్ర వేశారు. ఈ చిత్రంలో షారుక్ , కాజోల్ ల స్క్రీన్ కెమిస్ట్రి
అద్బుతంగా పండింది. ఓవ‌రాల్ గా ఆ చిత్రం షారుక్, కాజోల్ ను బాలీవుడ్ క్రేజి కాంబినేష‌న్ ను చేసింది.
డీడిఎల్ చిత్రం త‌రువాత షారుక్, కాజోల్ ప‌లు ప్రేమ క‌థా చిత్రాలు చేశారు. అవి కూడా ఘ‌న విజయం సాధించాయి. కానీ.. ఇప్ప‌టికి షారుక్ , కాజోల్ అంటే అభిమానుల మైండ్ లో మెదిలేది డీడిఎల్ చిత్ర‌మే. ప్రేమ‌, పెళ్లి, న‌మ్మ‌కం , క‌ట్టుబాట్లు, వంటి అంశాల్ని స‌మ‌న్వ‌యం చేసి ద‌ర్శ‌కుడు ఒక కుటుంబ కథా నేప‌థ్యంగా చేసిన ఈ చిత్రం షారుక్ ను సూప‌ర్ స్టార్ ను చేసేసింది. ఈ మ‌ధ్యనే ముంబాయిలో వెయ్యి వారాలు పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లో డిజిటిల్ ఫార్మేట్ లో సినిమాను రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌లు కృషి చేస్తున్న విష‌యం తెలిసిందే.
ఇదిలా వుంటే .. కాజోల్ పెళ్లి త‌రువాత సినిమాలు త‌గ్గించింది. చాలా లిమిటెడ్ గా చేస్తూ వ‌చ్చింది. చివ‌రిగా కాజోల్ , షారుక్ ఖాన్ తో చేసిన చిత్రం మై నేమ్ ఈజ్ ఖాన్. ఈ చిత్రం అంత‌గా అభిమానుల్ని అల‌రించ‌లేదు. ఇక తాజా విశేషం ఏమిటంటే.. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు రొహిత్ శెట్టి షారుక్ ఖాన్ తో దిలెవాలే అనే ఒక చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా మంచి ప్రేమ క‌థా అనే టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో షారుక్ స‌ర‌స‌న కాజోల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. సీనియ‌ర్ హీరోయినైనా గ్లామ‌ర్ చిత్రాలు చేయ‌క పోయినా.. కాజోల్ 5 కోట్లు రెమ్యున్ రేష‌న్ డిమాండ్ చేసింద‌నే టాక్ వినిపించింది. ఇక అటు షారుక్ , ఇటు కాజోల్ ఇద్ద‌రు మ్యారేజ్ అయిన వాళ్లే. ఇప్పుడు వీరిద్దరు ల‌వ్ స్టోరి చేయ‌డం అంటే క‌చ్చితంగా కొన్ని అంచ‌నాలుంటాయి. అయితే ఏ మేరకు మాస్ చిత్రాల ద‌ర్శ‌కుడు రొహిత్ శెట్టి.. షారుక్‌, కాజోల్ ల కాంబినేష‌న్ తో మెప్పిస్తాడో అనే సందేహాం షారుక్ అభిమ‌నుల్లో వినిపిస్తుంది. దిల్ వాలే సినిమాను ఈ యేడాది క్రిస్ట‌మ‌స్ కు రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు బాలీవుడ్ టాక్‌.
First Published:  29 April 2015 7:30 AM GMT
Next Story