Telugu Global
Others

ఏపీ రాజధానికి వెళ్ళి పోదాం: అశోక్‌బాబు

విజయవాడ: హైకోర్టు, సచివాలయం మినహా అన్ని శాఖలూ జూన్‌ తర్వాత ఏపీ రాజధాని నుంచే తమ కార్యకలాపాలు నిర్వహించడానికి సన్నద్ధం కావాలని ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు అశోక్‌బాబు పిలుపు ఇచ్చారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ ప్రభుత్వం తమకు పీఆర్సీని ప్రకటించిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాభివృద్ధికి తమ వంతు సేవ చేసేందుకు ఉద్యోగులంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఔట్‌ సోర్సింగ్‌ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేసేలోపు.. ముందుగా […]

ఏపీ రాజధానికి వెళ్ళి పోదాం: అశోక్‌బాబు
X
విజయవాడ: హైకోర్టు, సచివాలయం మినహా అన్ని శాఖలూ జూన్‌ తర్వాత ఏపీ రాజధాని నుంచే తమ కార్యకలాపాలు నిర్వహించడానికి సన్నద్ధం కావాలని ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు అశోక్‌బాబు పిలుపు ఇచ్చారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ ప్రభుత్వం తమకు పీఆర్సీని ప్రకటించిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాభివృద్ధికి తమ వంతు సేవ చేసేందుకు ఉద్యోగులంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఔట్‌ సోర్సింగ్‌ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేసేలోపు.. ముందుగా స్కేల్‌ ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని శాఖల ఉద్యోగులకూ హెల్త్ కార్డులు మంజూరు చేసేలా ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని, కిడ్నీ తదితర వ్యాధులకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని, రెండు లక్షలు దాటిన బిల్లులకు సాంకేతిక సమస్యలున్నాయని, దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తున్నామని చెప్పారు. మెడికల్‌ బిల్లుల రీయింబర్స్‌మెంట్‌ను జూన్‌ దాకా పొడిగించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఏపీ అభివృద్ధి బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు.
First Published:  30 April 2015 5:30 AM GMT
Next Story