Telugu Global
Cinema & Entertainment

పెద్దమనసు చాటుకున్న జూహీచావ్లా

బాలీవుడ్ సీనియర్ నటి, అందగత్తె జూహీచావ్లా అందంతోనే కాదు.. తన హుందాతనంతో కూడా అందర్నీ ఆకర్షిస్తోంది. సినిమాల్లేకపోయినప్పటికీ.. టీవీ రియాల్టీ షో వ్యాఖ్యాతగా, నిర్మాతగా, సీనియల్ ప్రొడ్యూసర్ గా కాస్త బిజీగానే ఉంటోంది జూహీ. అయితే అనుకోని అవకాశంగా ఈమెకో సినిమాలో కీలకపాత్ర పోషించే ఛాన్స్ వచ్చింది. తన దగ్గర మేకప్ మేన్ గా పనిచేసిన సుభాష్ అనే వ్యక్తి నిర్మాతగా మారి సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పేరు చాక్ అండ్ డస్టర్. కాస్త సమాజానికి […]

పెద్దమనసు చాటుకున్న జూహీచావ్లా
X
బాలీవుడ్ సీనియర్ నటి, అందగత్తె జూహీచావ్లా అందంతోనే కాదు.. తన హుందాతనంతో కూడా అందర్నీ ఆకర్షిస్తోంది. సినిమాల్లేకపోయినప్పటికీ.. టీవీ రియాల్టీ షో వ్యాఖ్యాతగా, నిర్మాతగా, సీనియల్ ప్రొడ్యూసర్ గా కాస్త బిజీగానే ఉంటోంది జూహీ. అయితే అనుకోని అవకాశంగా ఈమెకో సినిమాలో కీలకపాత్ర పోషించే ఛాన్స్ వచ్చింది. తన దగ్గర మేకప్ మేన్ గా పనిచేసిన సుభాష్ అనే వ్యక్తి నిర్మాతగా మారి సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పేరు చాక్ అండ్ డస్టర్. కాస్త సమాజానికి సందేశాన్నిచ్చేవిధంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం జూహీని సంప్రదించాడు సుభాష్. అడిగిన వెంటనే సినిమా నటించింది జూహీ. వరుసగా 4 రోజుల పాటు సెట్స్ కి వెళ్లి కష్టపడి నటించింది. తన పోర్షన్ యాక్టింగ్ అయిపోయిన తర్వాత కాస్త డబ్బుతో పాటు కొన్ని కాస్ట్ లీ బహుమతులు ఇవ్వడానికి ప్రయత్నించాడు సుభాష్. కానీ జూహీ ఒక్క పైసా కూడా తీసుకోలేదు. గంట కాల్షీట్ కే లక్షల్లో వసూలు చేస్తున్న ఈ రోజుల్లో 4 రోజులు నటించి ఒక్క పైసా కూడా తీసుకోకుండా తన పెద్దమనసు చాటుకుంది జూహి.
First Published:  29 April 2015 11:39 PM GMT
Next Story