8 ఏళ్ళ బాలిక హ‌త్యాప్ర‌య‌త్నం..

స‌మాజంలో వ‌స్తున్న పెడ పోక‌డ‌లు ప‌సిపిల్ల‌ల మ‌న‌సుల్ని కూడా క‌లుషితం చేస్తున్నాయి. అన్నెం పున్నెం ఎరుగుని ప‌సి హృద‌యాలు కూడా కొంచెం తేడా వ‌చ్చినా త‌ట్టుకోలేనంత‌గా, క‌సి పెంచుకునేవిధంగా ఆఖ‌రుకు హ‌త్యా ప్ర‌య‌త్నాలు చేసేవిధంగా స‌మాజం ప‌త‌న‌మ‌వుతోంది. న‌ల్గొండ జిల్లాలోని హుజూర్ న‌గ‌ర్ మండ‌లంలోని మాచ‌వ‌రం గ్రామంలో 8 ఏళ్ళ బాలిక 11 ఏళ్ల బాలిక‌పై హ‌త్యాప్ర‌య‌త్నం చేసింది. అచ్చంగుళ్ళు ఆడుకుంటున్న ఇద్ద‌రు బాలిక‌లు ఓడిందెవ‌రు, గెలిచిందెవ‌రు తే్ల్చుకోలేక కాసేపు గొడ‌వ‌ప‌డ్డారు. చివ‌రికి ప‌క్క‌నే క‌నిపించిన సీసాలోని కిరోసిన్‌ను త‌న స్నేహితురాలి శ‌రీరంపై పోసి నిప్పంటించేసింది ఎనిమిదేళ్ళ బాలిక‌. మంట‌ల్లో కాలిపోతున్న బాలిక‌ను వెంట‌నే ఆస్ప‌త్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 60 శాతం కాలిన గాయాల‌తో ఆ బాలిక చావు బ‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతోంది. రోజూడ గొడ‌వ ప‌డ‌కుండా ఆడుకునే ఇద్ద‌రు బాలిక‌లు చివ‌రికి ఇలా ఘ‌ర్ష‌ణ ప‌డి ఒక బాలిక మ‌రో బాలిక‌ను చంప‌డానికి ప్ర‌య‌త్నించిన ఘ‌ట‌న‌తో అటు పోలీసులు, ఇటు డాక్ట‌ర్లు కూడా ఆశ్చ‌ర్య‌పోతున్నారు.