రకుల్ కోసం నితిన్ విశ్వప్రయత్నం

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ యమ బిజిగా ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు రవితేజ సినిమా సెట్స్ పై ఉండనే ఉంది. త్వరలోనే మహేష్ బాబు సరసన కూడా నటిస్తుందనే రూమర్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి టఫ్ టైమ్ లో ఆమె కాల్షీట్ల కోసం తెగ ప్రయత్నిస్తున్నాడు నితిన్. మల్లిడి వేణు అనే కొత్త దర్శకుడితో త్వరలోనే ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు నితిన్. ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నిజానికి నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కొన్ని నెలల కిందటే ఓ సినిమా కోసం రకుల్ కు అడ్వాన్స్ ఇచ్చారు. కానీ ఆ సినిమా పట్టాలపైకి రాలేదు. రకుల్ అడ్వాన్స్ కూడా తిరిగివ్వలేదు. ఇప్పుడదే అడ్వాన్స్ సొమ్ముతో నితిన్ కొత్త సినిమాకు కాల్షీట్లు అడగాలని చూస్తున్నారు. మరి ఇంత బిజీ టైమ్ లో రకుల్, నితిన్ కోసం కాల్షీట్లు కేటాయిస్తుందా అనేది చూడాలి.
అటు నితిన్ కూడా కొత్తమ్మాయిల్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటాడు. మరీ ముఖ్యంగా స్టార్ డమ్ వచ్చిన హీరోయిన్ ను అస్సలు వదులుకోడు. ఎట్టిపరిస్థితుల్లో తన సినిమాలో తీసుకోవాల్సిందే అంటాడు. గతంలో కాజల్, ప్రియమణి, నిత్యామీనన్ ఇలా ఎంతోమంది హీరోయిన్లతో నటించిన నితిన్.. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం రకుల్ పై పెట్టాడు.