Telugu Global
National

డీఆర్‌డీఓ శాస్త్రవేత్త‌కు ఆర్‌ఐఎన్‌ ఫెలోషిప్‌

ఫెలోషిప్ ఆఫ్ ది రాయ‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేవిగేష‌న్ ల‌భించిన తొలి భార‌తీయుడిగా ర‌క్ష‌ణ‌, ప‌రిశోధ‌న‌, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) సీనియ‌ర్ శాస్త్రవేత్త జి. స‌తీష్‌రెడ్డి రికార్డు సృష్టించారు. ప్ర‌స్తుతం డీఆర్‌డీవో ప‌రిశోధ‌న సంస్థ ఇమార‌త్ డైరెక్ట‌ర్‌గా ఉన్న ఆయ‌న అగ్ని-5 క్షిప‌ణి రూప‌క‌ల్ప‌న‌లో కీల‌క భూమిక పోషించారు. ఘ‌ర్ష‌ణాత్మ‌క‌, ఉప‌గ్ర‌హ ఆధారిత నేవిగేష‌న్‌తోపాటు విమాన యానంలో వాడే ఎల‌క్ట్రానిక్స్ రంగాల్లో ఆయ‌న‌కు ముఫ్ఫై యేళ్ళ అనుభ‌వం ఉంది. వివిధ రంగాల్లో ఆయ‌న సాధించిన విజ‌యాలు అంత‌ర్జాతీయంగా […]

ఫెలోషిప్ ఆఫ్ ది రాయ‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేవిగేష‌న్ ల‌భించిన తొలి భార‌తీయుడిగా ర‌క్ష‌ణ‌, ప‌రిశోధ‌న‌, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) సీనియ‌ర్ శాస్త్రవేత్త జి. స‌తీష్‌రెడ్డి రికార్డు సృష్టించారు. ప్ర‌స్తుతం డీఆర్‌డీవో ప‌రిశోధ‌న సంస్థ ఇమార‌త్ డైరెక్ట‌ర్‌గా ఉన్న ఆయ‌న అగ్ని-5 క్షిప‌ణి రూప‌క‌ల్ప‌న‌లో కీల‌క భూమిక పోషించారు. ఘ‌ర్ష‌ణాత్మ‌క‌, ఉప‌గ్ర‌హ ఆధారిత నేవిగేష‌న్‌తోపాటు విమాన యానంలో వాడే ఎల‌క్ట్రానిక్స్ రంగాల్లో ఆయ‌న‌కు ముఫ్ఫై యేళ్ళ అనుభ‌వం ఉంది. వివిధ రంగాల్లో ఆయ‌న సాధించిన విజ‌యాలు అంత‌ర్జాతీయంగా ప్ర‌శంస‌లు కురిపించాయి. నేవిగేష‌న్‌లో ప్ర‌గ‌తిదాయ‌క ప‌రిశోధ‌న‌ల‌కు పేరొందిన రాయ‌ల్ ఇన్టిట్యూట్ ఆఫ్ నేవిగేష‌న్ (ఆర్ఐఎన్-రిన్) 1947లో ఏర్పాటైంది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 150 మంది నేవిగేష‌న్ ప్ర‌ముఖులు ఆర్ఐఎన్ ఫెలోషిప్ సాధించారు. ఇపుడు స‌తీష్‌రెడ్డికి ఈ ఫెలోషిప్ రావ‌డం నేవిగేష‌న్ వ‌ర్గాల్లో ఆనందం వ్య‌క్త‌మ‌వుతోంది.
First Published:  29 April 2015 7:37 PM GMT
Next Story