Telugu Global
National

రోడ్ సేఫ్టీ బిల్లుకు కార్మిక సంఘాల వ్య‌తిరేక‌త‌

కేంద్రం ప్ర‌తిపాదిస్తున్న ర‌హ‌దారుల భ‌ద్ర‌త బిల్లు లోప‌భూయిష్ట‌మైంద‌ని, దీన్ని వెంట‌నే ఉపసంహ‌రించుకోవాల‌ని కాంగ్రెస్‌తోపాటు వామ‌ప‌క్ష పార్టీలు డిమాండు చేస్తున్నాయి. ఈ బిల్లు శాస‌న‌మైతే సామాన్యుడి నుంచి ర‌వాణా రంగంలో ఉన్న 70 ల‌క్ష‌ల మంది ఎన్నో క‌ష్టాలు ప‌డాల్సి వ‌స్తుంద‌ని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ బిల్లు ప్ర‌కారం ప్ర‌తీ వాహ‌నానికి ఇన్యూరెన్స్ త‌ప్ప‌నిస‌ర‌ని, రోడ్డు ప్ర‌మాదంలో ఒక్క‌రు మ‌ర‌ణించినా డ్రైవ‌ర్‌ను బాధ్యుడిని చేస్తూ అత‌నికి 14 యేళ్ళ కారాగార శిక్ష విధించ‌వ‌చ్చ‌ని పేర్కొన్నాయి. ఈ బిల్లు […]

కేంద్రం ప్ర‌తిపాదిస్తున్న ర‌హ‌దారుల భ‌ద్ర‌త బిల్లు లోప‌భూయిష్ట‌మైంద‌ని, దీన్ని వెంట‌నే ఉపసంహ‌రించుకోవాల‌ని కాంగ్రెస్‌తోపాటు వామ‌ప‌క్ష పార్టీలు డిమాండు చేస్తున్నాయి. ఈ బిల్లు శాస‌న‌మైతే సామాన్యుడి నుంచి ర‌వాణా రంగంలో ఉన్న 70 ల‌క్ష‌ల మంది ఎన్నో క‌ష్టాలు ప‌డాల్సి వ‌స్తుంద‌ని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ బిల్లు ప్ర‌కారం ప్ర‌తీ వాహ‌నానికి ఇన్యూరెన్స్ త‌ప్ప‌నిస‌ర‌ని, రోడ్డు ప్ర‌మాదంలో ఒక్క‌రు మ‌ర‌ణించినా డ్రైవ‌ర్‌ను బాధ్యుడిని చేస్తూ అత‌నికి 14 యేళ్ళ కారాగార శిక్ష విధించ‌వ‌చ్చ‌ని పేర్కొన్నాయి. ఈ బిల్లు ద్వారా ప్ర‌యివేటు వ్య‌క్తుల‌కు ర‌వాణా రంగంపై పెత్త‌నం ల‌భిస్తుంద‌ని, డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేష‌న్లు ప్ర‌యివేటు వ్య‌క్తుల చేతిలో పెట్టాల‌ని కేంద్రం చూస్తోంద‌ని వారు ఆరోపించారు. ఇన్ని లోపాలున్న ఈ బిల్లును తెలుగుదేశం పార్టీ వ్య‌తిరేకించ‌క పోవ‌డం దారుణ‌మ‌ని వార‌న్నారు. వామ‌ప‌క్ష‌ కార్మిక సంఘాలు వ్య‌తిరేకిస్తున్న ఈ బిల్లుకు త‌మ మ‌ద్ద‌తు కూడా ఉంటుంద‌ని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు తెలిపారు.
First Published:  29 April 2015 6:00 PM GMT
Next Story