సల్మాన్ కు షాకిచ్చిన జడ్జి

 అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే కేసుకు సంబంధించి కొన్నేళ్లుగా విచారణకు హాజరవుతున్నాడు కండలవీరుడు సల్మాన్ ఖాన్. అయితే ఈసారి మాత్రం జడ్జి, సల్మాన్ కు షాకిచ్చారు. ఊహించని ప్రశ్న వేసి సల్మాన్ ను ఆశ్చర్యానికి గురిచేశాడు. రాజస్థాన్ లోని జోథ్ పూర్ కోర్టుకు విచారణ నిమిత్తం హాజరైన సల్మాన్ ను నీ మతమేంటని జడ్జి ప్రశ్నించడంతో.. సల్మాన్ తో పాటు అక్కడున్న లాయర్లంతా ఆశ్చర్యపోయారు. వెంటనే తేరుకున్న సల్మాన్, తన తండ్రి ముస్లిం అని తల్లి హిందూ అని చెప్పాడు. నిజమే సల్మాన్ తండ్రి సలీమ్ ఓ ముస్లిం. తల్లి సుశీల ఓ హిందు. అయితే జడ్జి ఈ ప్రశ్నను ఎందుకు వేశారనే విషయం మాత్రం ఎవరికీ అంతుచిక్కలేదు.