Telugu Global
Cinema & Entertainment

శింబు స‌ర‌స‌న ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు..

తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు లేని తాప్సీకి ఎట్ట‌కేల‌కు త‌మిళం లో ఒక‌ అవ‌కాశం త‌లుపు త‌ట్టింది. యువ హీరో శింబు సెల్వ‌రాఘ‌వ‌న్ దర్శకత్వంలో ఒక రొమాంటికి్ యాక్ష‌న్ చిత్రం చేయ‌నున్నాడ‌ని కోలీవుడ్ లో గ‌త కొద్ది రోజులుగా వార్త వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా త్రిష చేస్తుండ‌గా..సెకండ్ హీరోయిన్ రోల్ కు తాప్సీ ను తీసుకున్న‌ట్లు తెలుస్తుంది. ఈ చిత్రంతో మ‌న జ‌గ‌ప‌తి బాబు కూడా ఒక కీ రోల్ పోషించ‌నున్నార‌ని […]

శింబు స‌ర‌స‌న ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు..
X

తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు లేని తాప్సీకి ఎట్ట‌కేల‌కు త‌మిళం లో ఒక‌ అవ‌కాశం త‌లుపు త‌ట్టింది. యువ హీరో శింబు సెల్వ‌రాఘ‌వ‌న్ దర్శకత్వంలో ఒక రొమాంటికి్ యాక్ష‌న్ చిత్రం చేయ‌నున్నాడ‌ని కోలీవుడ్ లో గ‌త కొద్ది రోజులుగా వార్త వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా త్రిష చేస్తుండ‌గా..సెకండ్ హీరోయిన్ రోల్ కు తాప్సీ ను తీసుకున్న‌ట్లు తెలుస్తుంది. ఈ చిత్రంతో మ‌న జ‌గ‌ప‌తి బాబు కూడా ఒక కీ రోల్ పోషించ‌నున్నార‌ని టాక్.

మే మొద‌టి వారం నుంచి షూటింగ్ కు వెళ్ల‌నున్న‌ట్లు కోలీవుడ్ లో గుస గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు యువ్వన్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తార‌ని తెలుస్తుంది. ఇక లారెన్స్ స‌ర‌స‌న చేసిన గంగ చిత్రం తెలుగు నాట రిలీజ్ అయితే మ‌రి కొన్ని ఆఫ‌ర్స్ వ‌స్తాయ‌నే ఆశ తో తాప్సీ వుండ‌గా.. బాల‌య్య తో న‌టించిన ల‌య‌న్ చిత్రం విడుద‌ల‌య్యకా తెలుగులో త‌న కెరీర్ మరోసారి జోరు అందుకుంటుంద‌ని ఆశ ప‌డుతుంది త్రిష‌.

First Published:  29 April 2015 3:55 PM GMT
Next Story