అమ్మో ఇప్ప‌ట్లో  వాళ్లిద్ద‌రితో చేయ‌ను..! 

ఎక్క‌డైన ప్ర‌యోగాలు చేయ్యోచ్చు కానీ..  క‌మ‌ర్షియ‌ల్  స్టార్ హీరోలు  త‌మ చిత్రాల విష‌యంలో  ఎక్స్ పెర్మెంట్స్ చేస్తే   ప్ర‌మాదమే. అందుకు పెద్ద ఉద‌హార‌ణే  ర‌జ‌నీకాంత్ న‌టించిన కొచ్చాడియ‌న్ చిత్రమే.  కూతురు మీద ప్రేమ‌తో  ర‌జ‌నీకాంత్   కొచ్చాడియ‌న్ డైరెక్ష‌న్ సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ కు అప్ప చెప్పాడు.  క‌ట్ చేస్తే రిజ‌ల్ట్ ఎంత ఘోరంగా వ‌చ్చిందో తెలిసిందే.  ర‌జ‌నీకాంత్ మార్కెట్ ను  కొచ్చాడియ‌న్ అలియాస్ విక్ర‌మ్ సింహా దారుణంగా దెబ్బ తీసింది.  బొమ్మ‌ల చిత్రంగా చేసిన ప్ర‌యోగం  బెడిసి కొట్ట‌డంతో  ర‌జ‌నీకాంత్ అభిమానులు  సినిమాను  డైజిస్ట్ చేసుకోలేక పోయారు. 
ఈ సినిమా ఇచ్చిన రిజ‌ల్ట్ ఎఫెక్ట్ తో సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్   త‌న తండ్రి..త‌న భ‌ర్త  కాంబినేష‌న్ లో సినిమా చేసే ఆలోచ‌నే లేద‌ని  క్లారీటి  ఇచ్చేసింది. ప్ర‌స్తుతం త‌న భ‌ర్త ధ‌నుష్ హీరోగా కాయి రాజా కాయి చిత్రం చేసింది.  ఈ వారంలో ఆ సినిమా రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ప్రెస్ మీట్ లో మీడియా వారు  సౌంద‌ర్య ను  త‌న తండ్రి తో మ‌రో చిత్రం ఎప్పుడు వుంటుంద‌ని  ప్ర‌శ్నించగా..వారికి స‌మాధానంగా సౌంద‌ర్య  ఇప్ప‌ట్లో అటువంటి ఆలోచ‌నే లేద‌ని  తేల్చారు.  ర‌జ‌నీకాంత్ వంటి మాస్ స్టార్ హీరోను   ఎలా బ‌డితే అలా డైరెక్ట్ చేస్తే..  కుద‌ర‌దు అనే విష‌యం  సౌంద‌ర్య కు  త‌ను చేసిన  కొచ్చా డియ‌న్ తో  జ్ఞానోద‌యం అయి వుంటుంది అన‌డంలో సందేహాం లేదు క‌దా. !  ఇక కాయి రాజా కాయి చిత్రంలో  ధ‌నుష్ రోల్ అంద‌ర్ని మెప్పిస్తుంద‌నే భ‌రోసా వ్య‌క్త ప‌రిచింది.