ఓ ఇంటివాడు కాబోతున్న అల్లరోడు

 హీరో అల్లరినరేష్ కు పెళ్లి కుదిరింది. ఇన్నాళ్లూ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగిన అల్లరినరేష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఎల్లుండి (మే 3) అల్లరినరేష్ నిశ్చితార్థం. చెన్నైకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విరుపతో అల్లరినరేష్ ఎంగేజ్ మెంట్ జరగబోతోంది. ఇప్పటికే ఎంగేజ్ మెంట్ కు సంబంధించి సన్నిహితుల్ని ఆహ్వానించారు. పెళ్లి కూడా ఈనెలలోనే జరిపించేయాలని పెద్దలు నిశ్చయించారు. ఇప్పటికే ఇండస్ట్రీలోని ప్రముఖులకు సమాచారం అందించారు. పెళ్లయిన తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాడు అల్లరినరేష్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో జేమ్స్ బాండ్ అనే సినిమా చేస్తున్నాడు. నేను కాదు నా పెళ్లాం అనేది దీనికి ట్యాగ్ లైన్. ఈ కామెడీ ఎంటర్ టైనర్ షూటింగ్ పూర్తయిన వెంటనే హనీమూన్ ప్లాన్ చేశాడు అల్లరినరేష్. ఓ 3 నెలల పాటు సినిమాలకు దూరంగా ఉండి, తర్వాత ఫ్రెష్ గా మరో కొత్త సినిమా ప్రారంభించాలనుకుంటున్నాడు. సో.. అల్లరినరేష్ కి కూడా పెళ్లయిపోతుండడంతో టాలీవుడ్ లో ఇక మిగిలిన ఒకేఒక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ మాత్రమే.