Telugu Global
Others

మూడు కీల‌క తీర్పులిచ్చిన హైకోర్టు

హైకోర్టు శుక్ర‌వారం మూడు కీల‌క తీర్పుల‌ను ఇచ్చింది. ఇందులో ఒక‌టి తెలంగాణ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా రాగా మ‌రొక‌టి ఆంద్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెంప‌పెట్టు వంటిది. ఇక మూడోది హైకోర్టు విభ‌జ‌న‌కు సంబంధించిన‌ది. ఈ తీర్పు కోసం ఉద‌యం నుంచి ఇరు ప్రాంతాల న్యాయ‌వాదులు ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూసింది. కోర్టు ప‌రిస‌రాల్లో భారీ బందోబ‌స్తు కూడా ఏర్పాటు చేశారు. ఏపీ హైకోర్టు ఏర్పాటుకు ఉమ్మ‌డి హైకోర్టు `నో` ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైకో్ర్టు ఏర్ప‌డే వ‌ర‌కు ఉమ్మ‌డి హైకోర్టే కొన‌సాగుతుంద‌ని ఉన్న‌తా […]

AP High Court
X

హైకోర్టు శుక్ర‌వారం మూడు కీల‌క తీర్పుల‌ను ఇచ్చింది. ఇందులో ఒక‌టి తెలంగాణ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా రాగా మ‌రొక‌టి ఆంద్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెంప‌పెట్టు వంటిది. ఇక మూడోది హైకోర్టు విభ‌జ‌న‌కు సంబంధించిన‌ది. ఈ తీర్పు కోసం ఉద‌యం నుంచి ఇరు ప్రాంతాల న్యాయ‌వాదులు ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూసింది. కోర్టు ప‌రిస‌రాల్లో భారీ బందోబ‌స్తు కూడా ఏర్పాటు చేశారు.

ఏపీ హైకోర్టు ఏర్పాటుకు ఉమ్మ‌డి హైకోర్టు 'నో'
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైకో్ర్టు ఏర్ప‌డే వ‌ర‌కు ఉమ్మ‌డి హైకోర్టే కొన‌సాగుతుంద‌ని ఉన్న‌తా న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. అవ‌స‌ర‌మైతే హైకోర్టు బెంచ్‌ల‌ను తిరుప‌తిలోగాని, గుంటూరులోగాని, విశాఖ‌ప‌ట్నంలోగానే ఏర్పాటు చేసుకోవ‌చ్చ‌ని సూచించింది. ప్ర‌స్తుత కోర్టు ఉమ్మ‌డి హైకోర్టేన‌ని, దీన్ని ఇలాగే కొన‌సాగించాల‌ని స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌ట్లో హైకోర్టు విభ‌జ‌న ఉండ‌ద‌ని తెలిపింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భ‌వ‌నం నిర్మించిన త‌ర్వాతే హైకోర్టు ఏర్పాట‌వుతుంద‌ని స్ప‌ష్టంగా త‌న తీర్పులో చెప్పింది. తెలంగాణ‌లో హైకోర్టు కొత్త‌గా ఏర్పడాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఏపీ హైకోర్టు భ‌వ‌న నిర్మాణానికి కేంద్ర‌మే నిధులు మంజూరు చేయాల‌ని ఆ తీర్పులో పేర్కొంది.
రాజ‌ధాని రైతుల‌కు హైకోర్టులో ఊర‌ట‌
రాజ‌ధాని పేరు చెప్పి త‌మ భూములు బ‌లవంతంగా స్వాధీనం చేసుకోవ‌డానికి ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుందంటూ హైకోర్టుకెక్కిన అన్న‌దాత‌ల‌కు ఊర‌ట ల‌భించింది. ఇష్టం లేక‌పోతే భూములు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని, మీ భూముల్లో మీరు వ్య‌వ‌సాయం చేసుకోవ‌చ్చ‌ని సూచించింది. తాము అంగీకార ప‌త్రాలు ఇచ్చామ‌ని, అయితే త‌మ భూములు ఇవ్వ‌కూడ‌ద‌ని త‌ర్వాత నిర్ణ‌యించుకున్నామ‌ని, త‌మను భూ సేక‌ర‌ణ భారి నుంచి కాపాడాల‌ని అభ్య‌ర్థిస్తూ గురువారం గుంటూరు జిల్లా అమ‌రావ‌తి ప్రాంత రైతులు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. వీరికి అనుకూలంగా హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులిస్తూ భూముల‌ను రైతుల‌కు ఇష్టం లేకుండా బ‌ల‌వంతంగా స్వాధీనం చేసుకోవ‌ద్ద‌ని, వారు వ్య‌వ‌సాయం చేసుకుంటే అభ్యంత‌రం చెప్ప‌వ‌ద్ద‌ని ఆదేశిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వానికి సూచ‌నలు చేసింది. గ‌తంలో ఇచ్చిన తీర్పుల‌ను ఈ కేసుకు హైకోర్టుకు వ‌ర్తింప‌జేస్తూ ఈ ఆదేశాలు జారీ చేసింది. పెనుమాక‌, ఉండ‌వ‌ల్లి, నిడ‌మ‌ర్రు, రాయ‌పూడి రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.
క్యాబినెట్ సెక్ర‌ట‌రీల నియ‌మ‌కాలు చెల్ల‌వు
పార్ల‌మెంట‌రీ కార్య‌ద‌ర్శుల నియామ‌కాల్లో తెలంగాణ ప్ర‌భుత్వానికి హైకోర్టులో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఈ నియామ‌కాలు చెల్ల‌వ‌ని మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల్లో తీర్పు ఇచ్చింది. చ‌ట్టాన్ని య‌థాత‌దంగా కొన‌సాగించాల‌ని హైకోర్టు సూచించింది. ఆరుగురు పార్ల‌మెంట‌రీ కార్య‌ద‌ర్శుల‌కు క్యాబినెట్ హోదాను వెంట‌నే ఉప‌సంహ‌రించాల‌ని ఆదేశించింది. ఇక‌ముందు ఎలాంటి నియామ‌కాలు జ‌ర‌పాల‌నుకున్నా హైకోర్టు అనుమ‌తితోనే చేయాల‌ని ఆదేశించింది.
First Published:  1 May 2015 4:42 AM GMT
Next Story