ఆ హీరోయిన్ సైడ్ బిజినెస్  4 కోట్లు..! 

డ‌బ్బు వున్న వారికి  గుర్తింపు కావాలి.  గుర్తింపు వున్న వారికి డ‌బ్బు కావాలి. ఈ ప్రిన్స్ పుల్ మీద న‌డుస్తుంటాయి సెలిబ్రిటీల  సైడ్ బిజినెస్ లు.  ప్ర‌పంచ వ్యాప్తంగా  సినిమా సెలిబ్రిటీలు..  మ్యారేజ్ ఫంక్ష‌న్స్ లో ఆడి పాడ‌టం  సాధార‌ణ‌మే. ఈ ట్రెండ్ బాలీవుడ్ లో ఎక్కువుగా వుంటుంది. స‌ల్మాన్  ఖాన్ నుంచి..  షారుక్ ఖాన్ వ‌ర‌కు   అంద‌రు  ఇలా చేసిన వారే. ఇక హీరోయిన్స్ కూడా త‌క్కువేమి కాదు. తాజాగా  శ్రీ‌లంక బ్యాటీ జాక్విల‌న్ ఫెర్నాండేజ్ లండన్ లో జరగబోయే  ల‌క్నోకు చెందిన ఒక బిజినెస్ మెన్ కొడుకు మ్యారేజ్ లో రెండు రోజులు ఆడిపాడటానికి   4  కోట్లు డీల్ కూదుర్చుకుంద‌ట‌.  సినిమాల‌తో వ‌చ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవ‌డంలో జాక్విలిన్ చాల  ఫాస్ట్ గా ఉందంటున్నారు ఆమె కో హీరోయిన్స్. నిజ‌మే  దీపం వుండ‌గానే  ఇల్లు చక్క బెట్లుకోవాలి క‌దా. ఆ విష‌యం ఈ హాట్ హీరోయిన్ కు బాగా వంట బ‌ట్టిన‌ట్లుంది మ‌రి.!