Telugu Global
Others

కదలని 'మేకిన్‌' ... కూలుతున్న 'మేడిన్‌'

ఓవైపు ‘మేకిన్‌ ఇండియా’ నినాదం దేశ విదేశాలలో మారుమోగిపోతూనే ఉంది. మరో వైపు దేశంలోని పారిశ్రామిక, సేవా రంగాలు మూలుగుతున్నాయి. గత 17 నెలల కనిష్ట స్థాయికి అంటే -0.1కు పడిపోయింది. ప్రధాని ఆధ్వర్యంలో దేశం గుజరాత్‌ తరహా అభివృద్ధి నమూనాతో ప్రగతి పథంలో పరుగులు పెడుతుందని బిజెపి-నరేంద్రమోడి ప్రతిష్టను పెంచే కార్యక్రమం చెవుల్లో గింగిర్లు తిరుగుతుండగా నే దేశంలో మౌలిక రంగం వృద్ధి కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు అంచనాలు వెలువడ్డాయి. గుజరాత్‌ రాష్ట్రం తరహాలోనే దేశాన్ని […]

కదలని మేకిన్‌ ... కూలుతున్న మేడిన్‌
X

ఓవైపు ‘మేకిన్‌ ఇండియా’ నినాదం దేశ విదేశాలలో మారుమోగిపోతూనే ఉంది. మరో వైపు దేశంలోని పారిశ్రామిక, సేవా రంగాలు మూలుగుతున్నాయి. గత 17 నెలల కనిష్ట స్థాయికి అంటే -0.1కు పడిపోయింది. ప్రధాని ఆధ్వర్యంలో దేశం గుజరాత్‌ తరహా అభివృద్ధి నమూనాతో ప్రగతి పథంలో పరుగులు పెడుతుందని బిజెపి-నరేంద్రమోడి ప్రతిష్టను పెంచే కార్యక్రమం చెవుల్లో గింగిర్లు తిరుగుతుండగా నే దేశంలో మౌలిక రంగం వృద్ధి కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు అంచనాలు వెలువడ్డాయి. గుజరాత్‌ రాష్ట్రం తరహాలోనే దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళతారనే ప్రచారంతోబాటు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా కనిపించటంతో మోడిని చూసి బిజెపికి ఓట్లు వేసి అధికారంలో కూర్చోబెట్టారు. ఈలోగా ‘గుజరాత్‌ వైబ్రంట్‌’ విఫలమయ్యిందని వాస్తవాలు వెలుగుచూశాయి. ఇటీవలనే కాగ్‌ పలు నివేదికల్లో ‘వైబ్రంట్‌’ అంటూ ఏమీలేదంటూ వాస్తవాల గుట్టు విప్పి చూపింది. గుజరాత్‌లో ఏమి జరిగిందో ఏమోగాని మీడియా మాత్రం ఆ రాష్ట్రాన్ని, మోడినీ ఆశాకానికి ఎత్తేసింది. కాని వాస్తవాలు వెలుగుచూడటానికి కాగ్‌ నివేదికలతోగాని సాధ్యం కాలేదు. అదే సమయంలో ఆయన ‘మేకిన్‌ ఇండియా’ కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా విదేశీ పర్యటనల్లో భారత్‌కు వచ్చి పెట్టుబడులు పెట్టాలని తమ వాక్ఛాతుర్యంతో అందరినీ కట్టిపడేశారు.

గత ఏడాది స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న మేకిన్‌ఇండియా గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత 2014 సెప్టెంబర్‌ 25వ తేదీన ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో ప్రారంభించారు. అందులో భాగంగా గత ఏడాది డిసెంబర్‌ 29న ఉన్నతస్ధాయి వర్క్‌షాప్‌ను ఢిల్లీలోనే నిర్వహించారు. 25 రంగాలలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించి ఉత్పత్తి పెంచడటంద్వారా ప్రగతి బాట పట్టాలనేది ఈ కార్యక్రమం ముఖ్యఉద్ధేశ్యం. దీనికి ప్రచారం కల్పించే పనిని ‘డబ్ల్యూ+కె’ సంస్థకు అప్పగించారు. ఆఖరికి రక్షణ, రైల్వే లాంటి రంగాలలో సైతం 49 శాతం విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానంచేసింది. ఇప్పటికి ఆయన పర్యటించిన అన్ని దేశాలలోనూ ఇదే ప్రధానాంశంగా ప్రచారం చేసివచ్చారు. అందులో భాగంగా కొన్ని విదేశీ సంస్థలు ప్రతిపాదనలతో ముందుకు వచ్చాయి. అంతకు మించి ముందుకు సాగలేదు.

ఈ దశలో పిడుగులాంటి వార్త పడింది. దేశంలోని పారిశ్రామిక, సేవా రంగాలు మూలుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో ఎనిమిది కీలక రంగాలలో ప్రతికూలమైన వృద్ధిని నమోదుచేసుకుంది. గత ఏడాది మార్చిలో ఇది నాలుగు శాతం నమోదుకాగా ఏ ఏడాది మార్చిలో అది తిరోగమనానికి వెళ్ళి గత 17 నెలల కనిష్టానికి పడిపోవటం ఆందోళనకు గురిచేస్తోంది. బొగ్గు ఉత్పత్తి మాత్రం ఆరు శాతం పెరిగింది. దాంతో ఈ వేసవిలో విద్యుత్‌ సరఫరాలో లోటు ఉండదని ముందుగానే అంచనాలు వేశారు. అయినప్పటికీ విద్యుదుత్పత్తి గత ఏడాదికన్నా ఈ ఏడాది మరింతగా క్షీణించింది. ఎరువులు, చమురు, ఉక్కు, సిమెంట్‌ తదితర రంగాలు క్షీణించాయి. పరిస్థితి ఈ విధంగా ఉంటే మేకిన్‌ఇండియా ద్వారా సాధించేదేమిటో !?

First Published:  1 May 2015 5:49 AM GMT
Next Story