సమంత అంటే చాలా ఇష్టం

నాగచైతన్య బాంబు పేల్చాడు. సమంత అంటే తనకు చాలా ఇష్టమని మనసులో మాట చెప్పేశాడు. ఇప్పటివరకు చాలా మంది హీరోయిన్లతో నటించినప్పటికీ సమంత మాత్రం తనకు చాలా స్పెషల్ అంటున్నాడు. దీనికి ఓ కారణం ఉంది. సమంత-చైతూ ఇద్దరూ దాదాపు ఒకేసారి కెరీర్ ప్రారంభించారు. తర్వాత ఏమాయచేసావె సినిమాతో కలిశారు. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఆ సినిమాలో జెస్సీ పాత్రలో సమంత అదరగొట్టింది. ఆ సినిమా సూపర్ హిట్టయింది. అప్పట్నుంచి సమంత అంటే నాగచైతన్యకు సాఫ్ట్ కార్నర్. పైగా అక్కినేని త్రయం నటించిన మనం సినిమాలో కూడా సమంత నటించడం వెరీవెరీ స్పెషల్ లాంటి ఆ సినిమా కూడా సూపర్ హిట్టవ్వడం చైతూకు సమంతపై అభిమానం మరింత పెరిగేలా చేసింది. మధ్యలో ఆటోనగర్ సూర్య లాంటి సినిమాలు ఫెయిలైనా, సమంతపై ఉన్న సాఫ్ట్ కార్నర్ మాత్రం పోలేదు చైతన్యకి. ఇప్పటికే సమంతతో మూడు సినిమాలు చేసిన చైతు కుదిరితే మరోసారి కలిసి నటించేందుకు సిద్ధమని ప్రకటించాడు. అయితే ప్రస్తుతం తనకంటే సమంతానే బిజీగా ఉందని కూడా ఒప్పుకున్నాడు.