ఈ యేడాది నిత్యా మీనన్ దే..!

అలా మొదలైంది సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నిత్యా మీనన్ కి వరుస సినిమాలు వచ్చాయి. కేవలం స్టార్ ల‌ హీరో సినిమాలే కాకుండా, చిన్న సినిమాల సైతం ఒప్పుకొని తనకున్న టాలెంట్ అంతా చూపించి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించింది. తన నటనతో ఎంతో మంది మనసులను దోచుకుంది ఈ ముద్దు గుమ్మ. అందుకే ఎలాంటి వారైన నిత్యాను పొగడ్తలతో ముంచకుండా వదలరు. పైగా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీ గా గడుపుతుంది.
ఇప్పటికే 2015 సంవత్సరం లో తను నటించిన అయిదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మళ్ళీ మళ్ళీ ఇది రాణి రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, ఒకే బంగారం సినిమాలతో వరుస విజయాలు అందుకోగా, కాంచన 3 లో గెస్ట్ అప్పిరియ‌న్స్ ఇచ్చింది.. ఇక మలయాళంలో రిలీజ్ అయిన ‘100 డేస్ అఫ్ లవ్’ సినిమా కూడా విజయం సాధించింది.ఈ అయిదు సినిమాలే కాకుండా రుద్రమ దేవిలో, బెంగళూర్ డేస్ రీమేక్ లోను నటిస్తుంది. ఇక అన్నీ కుదిరితే ఈ సంవత్సరం లోనే క్వీన్ సినిమా రీమేక్ లో కూడా నటించే అవకాశం ఉంది. మొత్తం మీద దాదాపు 8 సినిమాలతో ఈ ఏడాది ఇండస్ట్రీని దున్నేయనుంది నిత్యా. అల్ థ బెస్ట్ నిత్యా..!