చివ‌రికి చిరు పూరీ జ‌గ‌న్నాధ్  కే మొగ్గు..! 

చిరు అభిమానులు   ఆయ‌న 150 సినిమా కోసం  కళ్లు కాయ‌లు కాసేలా వెయిట్ చేస్తున్నార‌న‌డంలో సందేహాం లేదు.  గ‌త యేడాది సార్వ‌త్రిక ఎన్నిక‌ల వ‌ర‌కు రాజకీయాల్లో బిజిగా గ‌డిపారు. ఆ త‌రువాత  చిరు పొలిటికల్ గా  రిలాక్స్ అయ్యారు.  ప్ర‌స్తుతం  త‌న 150 సినిమా సెట్స్ మీద‌కు తీసుకు రావ‌డానికి  గ‌త కొంత కాలంగా ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాధ్ తో పాటు ..ర‌చ‌యిత బీవియ‌స్ ర‌వితో క‌ల‌సి  క‌థ‌ను  పూర్తి చేయించే ప‌నిలో వున్నార‌ని స‌మాచారం.  ద‌ర్శ‌కుడు పూరి మెగాస్టార్ కోసం ఆటో జానీ పేరు తో ఒక టైటిల్ ను రిజ‌స్ట్ర‌ర్ చేయించడంతో  ..క‌చ్చితంగా అది చిరు కోస‌మే అంటున్నారు ఆయ‌న అభిమానులు. 
అయితే  ప్ర‌స్తుతం పూరీ  జ‌గ‌న్నాధ్, చార్మీ లీడ్ రోల్ లో జ్యోతిల‌క్ష్మీ చిత్రం చేస్తున్నారు. ఇది అయిన త‌రువాత  నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ తో  ఒక చిత్రం  వుంటుంద‌ని తెలుస్తుంది. వ‌రుణ్ తేజ్ తో సినిమా రిలీజ్ తరువాత‌  .. మెగాస్టార్ ప్రాజెక్ట్ ను  టేక‌ప్ చేస్తాడ‌ని స‌న్నిహితులు స‌మాచారం. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే.. చిరు  పుట్టిన రోజు   అంటే ఆగ‌ష్టు 22 న  ఆటో జాని కి  కొబ్బ‌రికాయ కొడ‌తార‌నేది  ఇన్ సైడ్ టాక్. వినోదానికి పెద్ద పీట వేస్తూ  ఈ చిత్రం వుంటుంద‌ని  టాక్.