Telugu Global
Others

ఎముకల శక్తిని పెంచే రాగులు

 రాగులు చాలా బలవర్థకమైన ఆహారం. తృణ ధాన్యాల్లో ఇవి అత్యంత ప్రధానమైనవి. మన పూర్వీకులు రాగులతో చేసిన ఆహార పదార్ధాలకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చేవారు. రాగులలో పుష్కలంగా ఉండే కాల్షియం, అయోడిన్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.  – రాగులలో ఉండే కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది.  – మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తీసుకుంటే మంచిది. ఇది ఎముకల పటుత్వానికి, ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది.  – మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా […]

ఎముకల శక్తిని పెంచే రాగులు
X
రాగులు చాలా బలవర్థకమైన ఆహారం. తృణ ధాన్యాల్లో ఇవి అత్యంత ప్రధానమైనవి. మన పూర్వీకులు రాగులతో చేసిన ఆహార పదార్ధాలకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చేవారు. రాగులలో పుష్కలంగా ఉండే కాల్షియం, అయోడిన్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
– రాగులలో ఉండే కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది.
– మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తీసుకుంటే మంచిది. ఇది ఎముకల పటుత్వానికి, ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది.
– మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది.
– మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్ధాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంలా పనిచేస్తాయి.
– రాగులలో అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు రాగులను వేయించి పొడిచేసిన పిండిని పాలల్లో కలిపి తాగిస్తే ఎదుగుదల, ఆరోగ్యం బాగుంటాయి.
– రాగిజావను సేవిస్తే కడుపులో మంట తగ్గుతుంది. చలువ చేస్తుంది. పైత్యాన్ని హరిస్తుంది.
– రాగుల వల్ల జుత్తు కుదుళ్లు దృఢమౌతాయి. జుత్తు కూడా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
First Published:  30 April 2015 7:30 PM GMT
Next Story