గంగను కత్తిరించి పడేశారు

ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన గంగ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అంశం వెలుగులోకి వచ్చింది. కాంచన-2గా ఇది ఇప్పటికే తమిళనాట విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. కోలీవుడ్ లో ఈ సినిమా హిట్టయింది కూడా. అయితే తమిళ ప్రేక్షకుల నుంచి కూడా కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. సెకెండాఫ్ లో గంగ సినిమా నిడివి కాస్త పెరిగిందనే విమర్శలు చెన్నై నుంచి వినిపించాయి. హారర్ పేరుపెట్టి సినిమాని సాగదీశారని అక్కడి ప్రేక్షకులు కంప్లయింట్ చేశారు. దీంతో గంగ టీం ఎలర్ట్ అయింది. తెలుగు ఆడియన్స్ నుంచి ఇలాంటి కామెంట్స్ రాకుండా ముందుగానే జాగ్రత్త పడింది. రిలీజ్ కు కొన్ని గంటల ముందు హుటాహుటిన నష్టనివారణ చర్యలు చేపట్టింది. గంగ సెకెండాఫ్ నుంచి ఏకంగా 10నిమిషాల సన్నివేశాల్ని తొలిగించారు. దర్శకుడు లారెన్స్, నిర్మాత బెల్లంకొండ సురేష్ కలిసి ఆఖరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకొని అమలుపరిచారు. మరి ఈ సెడెన్ డెసిషన్ సినిమాకు ఏ మేరకు కలిసొస్తుందో వేచిచూడాలి.