Telugu Global
Others

సినీ పెద్ద‌ల‌కు త‌ల‌సాని త‌లంటు!

హైదరాబాద్‌ : సినీ పరిశ్రమలోని పెద్ద‌లంతా త‌మ పాత అల‌వాట్ల‌ను మార్చుకుంటే మంచిద‌ని…  పొద్దున లేస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చుట్టూ ప్రదక్షిణలు చేయడం మానుకోవాలని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలుగు చ‌ల‌న చిత్ర‌ ప్రముఖులను హెచ్చరించారు. మేడే సందర్భంగా తెలంగాణ ఫిల్మ్‌చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో త‌ల‌సాని మాట్లాడుతూ తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు చంద్ర‌బాబు చుట్టూ తిరిగింది చాలు… తెలంగాణ రాష్ట్రం వ‌చ్చింది… […]

సినీ పెద్ద‌ల‌కు త‌ల‌సాని త‌లంటు!
X
హైదరాబాద్‌ : సినీ పరిశ్రమలోని పెద్ద‌లంతా త‌మ పాత అల‌వాట్ల‌ను మార్చుకుంటే మంచిద‌ని… పొద్దున లేస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చుట్టూ ప్రదక్షిణలు చేయడం మానుకోవాలని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలుగు చ‌ల‌న చిత్ర‌ ప్రముఖులను హెచ్చరించారు. మేడే సందర్భంగా తెలంగాణ ఫిల్మ్‌చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో త‌ల‌సాని మాట్లాడుతూ తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు చంద్ర‌బాబు చుట్టూ తిరిగింది చాలు… తెలంగాణ రాష్ట్రం వ‌చ్చింది… కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డింది… అయినా సినిమా వారు మాత్రం పాత అల‌వాట్ల‌ను మార్చుకోవ‌డం లేదు… అని ముక్కుసూటిగా అన్నారు. హైదరాబాద్‌లో ఉన్నవారంతా తెలంగాణ వారేనని, ఈ విష‌యం గుర్తుంచుకుంటే మంచిద‌ని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణాలో తామున్నామ‌ని, ఇక్క‌డ కేసీఆర్ ప్ర‌భుత్వం ఉంద‌ని ఇంకా సినీ పెద్ద‌లు గుర్తించిన‌ట్టు లేద‌ని మంత్రి త‌ల‌సాని చుర‌క‌లంటించారు.
First Published:  1 May 2015 7:43 AM GMT
Next Story