ఉత్తమ విలన్ విడుదలలో జాప్యం

కమల్ హాసన్ హీరోగా, రమేశ్ అరవింద్ దర్శకత్వంలో రూపొందుతున్న‌ చిత్రం “ఉత్తమ్ విలన్” మొదటి నుండి వివాదాల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ సినిమాలో కమల్ ఎనిమిదో శతాబ్దానికి చెందిన వ్యక్తిగా.. మోడరన్ సూపర్ స్టార్ గా  కనిపించబోతున్నారు. ఎన్నో వివాదాలు, సమస్యలు దాటుకొని ఈ శుక్రవారం విడుడల అవుతుందనుకున్నా మరోసారి చిక్కులెదుర్కొని ఆ చిత్రం విడుదల‌ ఆగిపోయింది .  ఇది కమల్ అభిమానులను కలవర పరిచే విషయమే. చిత్ర నిర్మాతలకు ఫైనాన్షియర్లకు మధ్య నెలకొన్న‌ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమస్యలతో  మొదటి ఆటను నిలిపి వేశారు. ఈ సమస్య త్వరగా సమసిపోయి సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా అభిమానులను అలరించాలని కోరుకుందాం…