రీచా మళ్ళీ తెరపైకీ ?

లీడర్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ్. ఆ తరువాత అవకాశాలు బాగానే వచ్చినా కాని విజయాలు మాత్రం అందుకోలేక పోయింది. నాగ వల్లి, మిరపకాయ్, సారోచ్చారు, మిర్చి, భాయ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించినా  విజయం మాత్రం మిర్చి రూపంలోనే అందింది. అది కూడా అనుష్క డామినేట్ చేయడంతో క్రెడిట్ అంత అనుష్క కే ద‌క్కింది. భాయ్ చిత్రం త‌రువాత రిచా అడ్ర‌స్ లేదు.
అయితే ఇంట‌ర్న‌ల్ గా టాక్ ఏమిటంటే..అమెరికన్ సిటిజన్ అయిన రీచా అక్కడ ఎం.ఎస్ చదవడానికి ముందు సరదాగా సినిమాలలో నటిద్దామని అనుకుని వచ్చిందట. అనుకోకుండా వెంటనే హిరోయిన్ అయిపోయిన రీచాకి ఆఫర్స్ తగ్గడంతో సినిమాలకి పుల్ స్టాప్ పెట్టి మళ్ళీ తిరిగి అమెరిక వెళ్ళిపోయిందట. దాదాపు రెండు సంవత్సరాలు అయింది రీచా సినిమాల పైపు చూడక. తనకి ఇష్టమైన ఫీల్డ్ లో ఇప్పుడు ఉండటంతో ‘ ప్రస్తుతం నేను రియాల్టీ కి దగ్గరగా బ్రతుకుతున్న. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది’ అంటూ స్టేట్మెంట్స్ ఇస్తుంది. ఏ విష‌యానికి ఆ విష‌యం కానీ.. మంచి ఆఫ‌ర్ వ‌స్తే రాకుండ వుంటుందా ఏమిటి..?